spot_img
Homeవార్త విశ్లేషణSleep Deprivation In Indian Metro Cities: భారత్ లో నిద్రలేని నగరాలు.. హైదరాబాద్‌...

Sleep Deprivation In Indian Metro Cities: భారత్ లో నిద్రలేని నగరాలు.. హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి?

Sleep Deprivation In Indian Metro Cities: గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో జీవన విధానం భిన్నంగా ఉంటుంది. రణగొన ధ్వనులు.. ఉరుకులు పరుగుల జీవితం, వాయు కాలుష్యం, వేడి ఇలా అనేక అంశాలు మనిషి జీవితంపై నిత్యం ప్రభావం చూపుతాయి. ఇక రేడియేషన్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. కాంక్రీటు జంగిల్‌లో మన శరీరానికి అవసరమైన, ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్లు కూడా లభించడం లేదు. ఇక ఆహారం పూర్తిగా కలుషితమైంది. రెడీమేడ్‌, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌కు నగరవాసులు అడిక్ట్‌ అవుతున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు జంక్‌ ఫుడ్‌ను ఇష్టంగా తింటున్నారు. అయితే నిల్వకు ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్‌ మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫోన్‌ లేకుండా క్షణం ఉండలేని పరిస్థితికి మనిషి దిగజారిపోయాడు. దీంతో మనిషి కళ్లు, నిద్ర, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు నిద్ర గురించి అధ్యయనం చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రధాన 6 మెట్రోల్లో 70% పైగా ప్రజలు ఆలస్యంగా నిద్రపపోతున్నారని తెలిపింది. హైదరాబాద్ కాస్త మెరుగ్గా ఉన్నా.. దేశవ్యాప్తంగా ఆశ్చర్యకరంగా ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్‌కు ఒక హెచ్చరికలా ఉన్నాయి.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

ముంబై అగ్రస్థానం..
దేశ ఆర్థిక రాజధాని ముంబై వాసులు నిద్రలేమిలో అగ్రస్థానంలో ఉన్నారు. 76.5 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. 32 శాతం మంది ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇక పని సమయంలో 58 శాతం మంది కునుకుతీస్తున్నారు. 65 శాతం మంది నిద్ర చాలడం లేదని, విశ్రాంతి లేదని భావిస్తున్నారు.

రెండోస్థానంలో కోల్‌కతా..
ఇక మరో మెట్రో నగరం కోల్‌కతా నిద్రలేమిలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ, 75.5 శాతం ఆలస్యంగా నిద్రపోతున్నారు. నిద్రలేమితో బాధపడేవారి సంఖ్య ముంబైత పోలిస్తే 8 శాతం తక్కువగా 52 శాతం ఉంది. ఆలస్యంగా నిద్ర లేచేవారు ఎక్కువగా ఉన్నారు. 38 శాతం మంది ఆలస్యంగా మేల్కొంటున్నారు. ఇక పనిలో నిద్రపోయేవారు 49 శాతం ఉండగా, నిద్ర చాలడం లేదని భావించేవారు 58 శాతం ఉన్నారు.

మూడో స్థానంలో రాజధాని..
ఇక దేశరాజధాని నిద్రలేమిలో మూడోస్థానంలో నిలిచింది. ఇక్కడ 68 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. నిద్రలేమితో 48 శాతం మంది బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారు 45 శాతం ఉండగా, 55 శాతం మంది పని సమయంలో కునుకు తీస్తున్నారు. ఇక విశ్రాంతి లేదని, నిద్ర చాలడం లేదని 62 శాతం మంది ఫీల్‌ అవుతున్నారు.

ఐటీ రాజధాని నాలుగో స్థానం..
ఇక దేశ ఐటీ రాజధాని బెంగళూరు నిద్రలేమిలో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ఆలస్యంగా నిద్రపోయేవారు తక్కువగానే ఉన్నారు. 36.3 శాతం మంది ఆలస్యంగా నిద్రిస్తున్నారు. కానీ నిద్రలేమితో బాధపడేవారు 54 శాతం ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారు 29 శాతం ఉండగా, పని సమయంలో నిద్రపోయేవారు 62 శాతం ఉన్నారు. నిద్ర చాలనివారు 54 శాతం ఉన్నారు.

ఐదో స్థానంలో హైదరాబాద్‌..
దేశ రెండో ఐటీ రాజధానిగా ఎదుగిన హైదరాబాద్‌ నిద్రలేమిలో 5వ స్థానంలో ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. 31 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారు 25 శాతం ఉన్నారు. విధుల్లో కునుకుతీసేవారు 38 శాతం మంది ఉన్నారు. అయితే నిద్రలేమి ఉందని, విశ్రాంతి ఉండడం లేదని భావించేవారు 40 శాతం ఉన్నారు.

చివరి స్థానంలో చెన్నై..
దక్షిణ భారత దేశ నగరమైన చెన్నై నిద్రలేమిలో చివరిస్థానంల ఉంది. ఇక్కడ 45 శాతం మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. హైదరాబాద్‌తో పోలిస్తే వీరి సంఖ్య ఎక్కువే. ఇక నిద్రలేమితో బాధపడేవారు 35 శాతం ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారు అత్యంత తక్కువగా 23.8 శాతం మంది ఉన్నారు. పని సమయంలో నిద్రపోయేవారు 42 శాతం ఉన్నారు. నిద్ర లేదని భావించేవారు తక్కువగా 38 శాతం మంది ఉన్నారు.

మెరుగ్గానే హైదరాబాద్..
ఉత్తర భారత దేశ నగరాలతో పోలిస్తే దక్షిణ భారత దేశ నగరాలు అయిన హైదరాబాద్‌, తమిళనాడు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. హైదరాబద్‌ ఐటీ హబ్‌గా ఉన్నా, సాంప్రదాయక జీవనశైలి (భోజన సమయాలు, కుటుంబ బంధాలు) సహాయపడుతున్నాయి. ఫలితంగా ‘సమతుల్య నిద్ర నగరం’గా గుర్తింపు ఉంది.

నిద్రలేమికి ప్రధాన కారణాలు..
నిద్రలేమికి కారణాలను కూడా సర్వే సంస్థ వెల్లడించింది. 87.6 శాతం మంది పడుకునే ముందు ఫోన్‌ చూస్తున్నారట. బ్లూలైట్‌ మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుందని తెలిపింది. తర్వాత ఉద్యోగ ఒత్తిడి కారణంగా నిద్ర సమస్య ఉందని తెలిపింది. అందుకే 57.8 శాతం మంది ఆఫీసులో నిద్రపోతున్నారని పేర్కొంది. ఇక రాత్రి షిఫ్టుల కారణంగా కూడా నిద్రలేమి పెరుగుతుంది వెల్లడించింది. ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం, కాఫీలు ఎక్కువగా తాగడం, జంక్‌ ఫుడ్‌ కూడా నిద్రపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది. ట్రాఫిక్ శబ్దం, కాలుష్యం 40% నిద్ర భంగానికి కారణమని పేర్కొంది.

నిద్రలేమితో దీర్ఘకాలిక పరిణామాలు..
సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత క్షీణత 30 శాతం పెరుగుతుంది. ఆందోళన, డిప్రెషన్ పెరుగుతాయి. ఊబకాయం రిస్క్‌ 25 శాతం పెరుగుతుంది, డయాబెటిస్ రిస్క్‌ 40 శాతం పెరుగుతుంది. గుండె జబ్బులు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. నిద్రకు ఉపక్రమించే గంట ముందే స్క్రీటైం ఆపేయడం, బెడ్‌రూంకు ఫోన్‌ దూరంగా ఉంచడం ద్వారా రిస్‌‍్కలు తగ్గించొచ్చు. రాత్రి భోజనం 8 గంటలలోపు చేసి, కాఫీలు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, ధాన్యం నిద్ర లేమి సమస్యకు పరిష్కారమని పేర్కొన్నారు. 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరమని అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular