Homeజాతీయ వార్తలుManmohan Singh Oil Subsidy Burden: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

Manmohan Singh Oil Subsidy Burden: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

Manmohan Singh Oil Subsidy Burden: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం నెలకొంది. ఇప్పుడిప్పుడే సరఫరా కాస్త మెరుగు పడింది. అయితే గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడి కారణంగా చమురు ధరలు పెరిగాయి. అయితే భారత్‌ ఎల్పీజీ ధరలు మాత్రమే పెంచింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచలేదు. మోదీ ప్రభుత్వం భారీగా నిల్వలు పెంచడంతో మనపై ప్రభావం అంతగా లేదు. అయితే ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు రెండేళ్లుగా రూ.110 వద్ద స్థిరంగా ఉంటున్నాయి. ఈ […]

Manmohan Singh Oil Subsidy Burden: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా చమురు సంక్షోభం నెలకొంది. ఇప్పుడిప్పుడే సరఫరా కాస్త మెరుగు పడింది. అయితే గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడి కారణంగా చమురు ధరలు పెరిగాయి. అయితే భారత్‌ ఎల్పీజీ ధరలు మాత్రమే పెంచింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచలేదు. మోదీ ప్రభుత్వం భారీగా నిల్వలు పెంచడంతో మనపై ప్రభావం అంతగా లేదు. అయితే ప్రస్తుతం పెట్రోల్‌ ధరలు రెండేళ్లుగా రూ.110 వద్ద స్థిరంగా ఉంటున్నాయి. ఈ భారం పాపం కూడా మన్మోహన్‌సింగ్‌ మోపిందే. ఈ విషయం చాలా మందికి తెలియదు.

Also Read: ఉత్తర కొరియా ఎన్నికలు.. కమ్యూనిస్టు రాజ్యంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇదీ

2008లో చమురు ధరలకు రెక్కలు..
2008లో అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్యారల్‌ ధర 140 డాలర్లకు పెరిగింది. దీంతో అయిల్‌ కంపెనీలు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో కంపెనీలు లీటర్‌ ధర రూ.20 పెంచి రూ.60 చేయాలని అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. అయితే ఎన్నికలు సమీపంలో ఉండటంతో రూ.40లోనే అమ్ముకుని, మిగిలిన భారాన్ని భవిష్యత్‌ బాండ్ల ద్వారా కవర్‌ చేసింది. దీని పరిణామాలు 2014 తర్వాత మోదీ ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారంగా మారాయి.

ఎన్నికల వ్యూహంతో సబ్సిడీ డ్రామా…
పార్లమెంటరీ ఎన్నికల ముందు ధరలు రూ.40లో ఫిక్స్‌ చేశారు. అదనపు రూ.20 లక్షణాన్ని ఆయిల్‌ సెక్టార్‌కు బాండ్ల రూపంలో ఇచ్చారు. ఇవి 15–20 ఏళ్ల వాయిదాలతో 8% వడ్డీతో రీపే చేయాల్సి వచ్చింది. ఆయిల్‌ బాండ్ల విలువ రూ.1.3 లక్షల కోట్లు కాగా, మోదీ ప్రభుత్వం వడ్డీతో కలిసి రూ.3.23 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇటీవలే చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ను మోదీ సర్కార్‌ చెల్లించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయం 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్‌కు భారంగా మారింది. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, ఆదాయాలను తగ్గించి పెట్టుబడులను ప్రభావితం చేసింది. మోదీ ప్రభుత్వం దీన్ని తీర్చడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper