spot_img
Homeక్రీడలుSanju Samson vs Ravindra Jadeja : సంజు శాంసన్ అట్టర్ ప్లాప్.. వజ్రం కోసం...

Sanju Samson vs Ravindra Jadeja : సంజు శాంసన్ అట్టర్ ప్లాప్.. వజ్రం కోసం బంగారాన్ని వదులుకున్న సీఎస్ కే

Sanju Samson vs Ravindra Jadeja : బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడతున్నారు. కేజీఎఫ్2 సినిమాలో ఓ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ మాట ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అచ్చు
గుద్దినట్టు సరిపోతుంది. ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలిచింది చెన్నై జట్టు.
అంతటి చరిత్ర ఉన్న చెన్నై జట్టు యాజమాన్యం.. తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర
స్థాయిలో విమర్శలకు కారణమవుతోంది.

ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి గత ఏడాది చివరలో వేలం జరిగింది. ఆ వేలం
లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న రవీంద్ర జడేజా ను చెన్నై జట్టు యాజమాన్యం వదులుకుంది.
రాజస్థాన్ జట్టు అతడిని కొనుగోలు తీసేసుకుంది. రాజస్థాన్ జట్టు సంజుశాంసన్ ను చెన్నైకి వదిలేసింది.

రాజస్థాన్ జట్టులో చేరిన రవీంద్ర జడేజా దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. గన్ పైర్ సెలబ్రేషన్ చేసి సంచలనం కలిగించాడు. అటువంటి కసి అతడిలో కలగడానికి ప్రధాన కారణం చెన్నై యాజమాన్యం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పైగా రవీంద్రజడేజా మ్యాచ్ ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ధోనీతో మాట్లాడలేదని
స్పష్టం చేశాడు.

సంజు శాంసన్ ను తీసుకున్న చెన్నై యాజమాన్యం తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నది. తొలి మ్యాచ్ లో సంజు దారుణంగా విఫలమయ్యాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో
ఏడు బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు మాత్రమే చేశాడు.బర్గర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన సంజు.. సొంత మైదానంలో పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ సంజుఅట్టర్ ప్లాఫ్ అయ్యాడు. బార్ట్ లెట్ బౌలింగ్ లో కీపర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.ఈసారి కూడా ఏడు పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశ పరిచాడు.

టీ20 వరల్డ్ కప్ లో సత్తా చూపించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ.. ఐపీఎల్ లో విఫలమవుతున్నాడు.గత ఏడాది రాజస్థాన్ యాజమాన్యంతో భేదాలు రావడంతో సంజు అలిగాడు. మరి ఇప్పడు ఏమైంది సంజు భయ్యా?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular