spot_img
Homeవింతలు-విశేషాలుChinese Billionaire Woman 6th Marriage: ఇప్పటికి ఐదు పెళ్లిళ్లు చేసుకుంది.. ఆరో పెళ్లికి 68...

Chinese Billionaire Woman 6th Marriage: ఇప్పటికి ఐదు పెళ్లిళ్లు చేసుకుంది.. ఆరో పెళ్లికి 68 కోట్ల కట్నం ఇచ్చింది.. ఎవరిమే.. ఏమా కథ

Chinese Billionaire Woman 6th Marriage: జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుంది. కొందరికి ఇంకోసారి జరుగుతుంది. మరికొందరికి అయితే మళ్లీమళ్లీ జరుగుతుంది. చదువుతుంటే యమలీల సినిమాలో తోటరాముడు పాత్రధారి తనికెళ్ల భరణి చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది కదా.. ఆ డైలాగ్ మాదిరిగానే ఉంది ఈమె పరిస్థితి.

అది చైనా దేశం. ఆమె పేరు యు వెన్ హాంగ్.. వయసు 55 సంవత్సరాల వరకు ఉంటుంది. చైనాలో మహిళ బిలియనీర్ల జాబితాలో ఈమెకు ముందు వరస స్థానం ఉంటుంది. గతంలోనే ఈమెకు పెళ్లయింది. ఆ పెళ్లి కొద్ది రోజుల్లోనే విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. మూడో పెళ్లి కొద్ది రోజులు నిలబడింది గాని.. ఆ తర్వాత అది కూడా పేటాకులు అయిపోయింది. ఇక నాలుగో పెళ్లి చేసుకున్నట్టు ఆమెకే గుర్తులేదు. ఐదవ పెళ్లి కూడా అలా జరిగి ఇలా ముగిసింది..

రెండవ భర్త ద్వారా ఈమె గర్భం దాల్చింది. ఒక బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బాబుకు 17 సంవత్సరాల వయసు. కాలేజీ లో చదువుతున్నాడు. 55 సంవత్సరాల వయసులో యు వెన్ హాంగ్ కు మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది. ఇదే విషయాన్ని బంధువుల దగ్గర వ్యక్తం చేస్తే వారు ఆమెను తిట్టారు. ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటావని మండిపడ్డారు. తిట్టేనోరు తిట్టక ఊరుకోదు.. తిరిగే కాలు తిరగక ఊరుకోదు అన్నట్టు.. పెళ్లి చేసుకోవాలని కోరిక ఈమెలో కలిగిన తర్వాత.. ఆగలేదు.. ఆరో పెళ్లి కోసం రెడీ అయింది. వరుడి కోసం తీవ్రంగా అన్వేషించింది.

ఈసారి తనకంటే చిన్న వయసు వాడితో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అలా ఎందుకని బంధువులు అడిగితే.. తనకు కొన్ని కోరికలు ఉన్నాయని.. అవి తీర్చుకోవాలంటే చిన్న వయసు వాడు కరెక్ట్ అని సమాధానం చెప్పడంతో వారు నోర్లు మూసుకున్నారు. అలా అన్వేషించి అన్వేషించి 30 సంవత్సరాల యువకుడిని లైన్ లో పెట్టింది. అతడికి డబ్బు ఆశను చూపించింది. ఏకంగా 68 కోట్ల కట్నాన్ని ఆఫర్ చేసింది.. లగ్జరీకార్లు.. ఆస్తులను అదనంగా ఇస్తానని చెప్పింది. దీంతో అతడు ఒప్పుకున్నాడు.. ఒక మంచి రోజు చూసుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కూడా వెళ్లిపోయారు. ప్రస్తుతానికి వారిద్దరు స్వర్గసుఖాలలో విహరిస్తున్నారు.

డబ్బు అందరి దగ్గర ఉండదు. ఉన్నవాళ్లకు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. లేని వాళ్లకు ఎలా సంపాదించాలో అర్థం కాదు. కానీ కొందరు డబ్బును ఎరగా చూపించి ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు.. ఈ జాబితాలో యు వెన్ హాంగ్ ఎప్పటికీ మొదటి స్థానంలోనే ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular