Rakasa Movie OTT release : ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాతగా వ్యవహరించిన రెండవ చిత్రం ‘రాకాస'(Rakasa Movie). సంగీత్ శోభన్(Sangeeth Sobhan) , నయన్ శారికా(Nayan Sarika) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ని కలిగించాయి. దానికి తగ్గట్టు మేకర్స్ కూడా ప్రొమోషన్స్ భారీగా చేయడం తో ఈ సినిమా జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం పైడ్ ప్రీమియర్ షోస్ హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో కళకళలాడిపోయాయి. అదే విధంగా మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా ప్రతీ సెంటర్ లో అదిరిపోయాయి. అయితే విడుదలైన రోజే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
అదేమిటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసిందట. సంగీత్ శోభన్ గత రెండు చిత్రాలు మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ లకు నెట్ ఫ్లిక్స్ లో రికార్డు స్థాయి వ్యూస్ రావడంతో ఈ సినేమని 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ ని బట్టీ ఈ చిత్రాన్ని 4 వారాల తర్వాత కానీ , లేదంటే 8 వారాల తర్వాత కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసుకోవచ్చని ఒప్పందం చేసుకున్నారట. అంటే ఇప్పుడు థియేటర్స్ లో ఈ చిత్రం రన్ రెండు వారాలకే అయిపోతే కచ్చితంగా ఈ చిత్రం నాలుగు వారాల్లోనే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. అంటే ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు అన్నమాట. అలా కాకుండా మూడు వారాలకు మించి రన్ వస్తే మాత్రం 8 వారాలు ఆగాల్సిందే.
కాబట్టి థియేట్రికల్ రన్ ఆధారంగానే ఈ సినిమా ఎంత తొందరగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది అనేది ఆధారపడి ఉంది. మంచి ఒప్పందం కదూ, ఇలాంటి ఒప్పందాలను నిర్మాతలందరూ చేసుకుంటే , భవిష్యత్తుల సినిమా థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య బాగా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయలకు జరిగింది. వీకెండ్ ముగిసే లోపు కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి ఈ సినిమా వచ్చేస్తుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నారు.
