Homeఎంటర్టైన్మెంట్Sampradayani Suppini Suddapoosani review : 'సంప్రదాయాని సుప్పిని సుద్దపూసని' ఫుల్ మూవీ రివ్యూ... హిట్టా?...

Sampradayani Suppini Suddapoosani review : ‘సంప్రదాయాని సుప్పిని సుద్దపూసని’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?

Sampradayani Suppini Suddapoosani review : శివాజీ ఒకప్పుడు హీరోగా రాణించాడు. ఆ తర్వాత ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యాడు. 90స్ బయోపిక్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆయన ఆ మూవీతో అదరగొడుతున్నాడు. డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటూ సినిమా సినిమాకి తన నటనలో వేరియేషన్స్ ను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ అనే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

శివాజీ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన ఫ్యామిలీని లీడ్ చేస్తుంటాడు. అనుకోని కారణాలవల్ల ఆ ఫ్యామిలీకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి…ఇక ఆ ప్రాబ్లమ్స్ నుంచి శివాజీ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు…వాళ్ల ఫ్యామిలీ ఎలాంటి క్రైమ్ లో ఇరుకుంది. దాని వెనకాల ఎవరున్నారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమాను దర్శకుడు క్రైమ్ కామెడీ అంటూ ప్రమోట్ చేశాడు…కానీ సినిమాలో ఎక్కడ కూడా మనకు పెద్దగా నవ్వైతే రాదు…ఇక క్రైమ్ ఎపిసోడ్ సైతం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు…రెండున్నర గంటల నిడివి ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు…ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు వర్కౌట్ అయినట్టుగా అనిపించినప్పటికి ఆ ఫ్లో ను మెయింటైన్ చేయడం లో దర్శకుడు తడబడ్డాడు…కొన్ని కామెడీ సన్నివేశాలైతే చిరాకు తెప్పిస్తాయి… ఈ మూవీ ఎప్పుడు అయిపోతుందిరా బాబు అని ప్రతి ఆడియన్ ఫీల్ అవుతుంటాడు… ఇక సీన్ కి సీన్ కి ఫ్లో కూడా అంతా బాగా సెట్ అవ్వలేదు. సినిమాని చూస్తునంత సేపు ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది తప్ప సినిమా ఒక్క చోట కూడా హై ఫీల్ అయితే ఇవ్వలేదు…

ఈ మూవీలో ఎమోషన్స్ సైతం నార్మల్ గా ఉన్నాయి…పీక్స్ లోకి తీసుకెళ్లే ఎమోషన్ లేకపోవడం వల్ల సినిమా సాగుతూనే ఉన్న ఫీల్ కలుగుతుంది…ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఓకే అనిపించినప్పటికి అప్పటికే సినిమాకి జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది… మ్యూజిక్ సైతం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే కనీసం కొన్ని సన్నివేశాలు అయిన ఎలివేట్ అయ్యేవి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

శివాజీ ఈ సినిమాలో సైతం అటు కామెడీని పండిస్తూనే ఇటు ఎమోషనల్ గా సినిమాకి కనెక్ట్ అయ్యే విధంగా నటించాడు. కానీ సినిమాలోని కోర్ ఎమోషన్ అంత పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో ఆయన ఎంతసేపు నటించిన కూడా ఆయన నటన బాగుంది తప్ప సినిమా ఎమోషన్ కి కనెక్ట్ కాకుండా పోయింది. ఇక లయ సైతం చాలా మంచి పాత్రలో నటించింది. ఈ మధ్యకాలంలో ఆమెకు ఇలాంటి పాత్ర అయితే దొరకలేదు. ఫస్టాఫ్ లో వచ్చే ఒక ఎపిసోడ్ లో ఆమె గిరికింతలు పెట్టిందనే చెప్పాలి… ఇక రోహాన్ యాక్టింగ్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి అక్కడక్కడ ఓవరాక్టింగ్ గా అనిపించింది.

అలాంటివి లేకుండా చూసుకొని ఉంటే బాగుండేది. ఇక ఆలీ, ధనరాజ్ లాంటి మిగతా ఆర్టిస్టులు సైతం సినిమా ను ముందుకు తీసుకెళ్లడానికి హెల్ప్ అయ్యారు తప్ప వాళ్ళ క్యారెక్టర్ తో సినిమా కి హైలైట్ అయ్యే అంశాలు అయితే రాలేదు. దానివల్ల వాళ్ళందరు ఉన్నా కూడా వారిని పూర్తిగా వాడుకోలేదు అనే ఫీల్ కలుగుతుంది… ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు ఒకే టెంపో లో ఇచ్చారు తప్ప అప్ అండ్ డౌన్స్ ఏమీ లేకుండా ఆ సీన్ కంటెంట్ ను ఫాలో అవుతూ బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వలేకపోయారు. దానివల్ల ఏ సీన్ లో ఎమోషన్ హైలెట్ అవుతుందో తెలియని ఒక కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు పడిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ఈ సినిమాకి అదే జరిగింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సైతం ఈ సినిమా మీద అంత పెద్దగా ఎఫర్ట్ పెట్టనట్టుగా కనిపిస్తుంది…విజువల్ గా సినిమా ఓకే అనిపించింది. ఆ గ్రాండీయార్ ని కూడా చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ఈ సినిమాలో బాగున్నవి

ఫస్టాఫ్ లో కామెడీ
శివాజీ యాక్టింగ్
క్లైమాక్స్ ట్విస్ట్

ఈ సినిమాలో బాగోలేనివి

కథ
బోరింగ్ సీన్స్
సెకండాఫ్

రేటింగ్ : 2.25/5

చివరి లైన్ : డార్క్ కామెడీ సినిమాలు నచ్చేవాళ్ళు ఒకసారి చూడచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular