Homeక్రీడలుIndia vs Pakistan Sahibzada Farhan : మీ బుద్ది మారదారా పాకిస్తానోడా? 50 కొట్టి...

India vs Pakistan Sahibzada Farhan : మీ బుద్ది మారదారా పాకిస్తానోడా? 50 కొట్టి భారత్ పై గన్ ఫైరింగ్ సెలబ్రేషన్సా?

India vs Pakistan పుట్టిన నాటి బుద్ధి పుడకలతో కూడా పోదు అంటారు పెద్దలు. ఆ మాటను ఎందుకు అంటారో ఆదివారం నాటి భారత్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ నిరూపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు చేసిన ప్రదర్శన విమర్శలకు కారణమైంది. Sahibzada Farhan hunting Rafale and Indian cricket team. pic.twitter.com/Qdo0RrZYWa— Azlan (@azlanxz) September 21, 2025 ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ […]

India vs Pakistan పుట్టిన నాటి బుద్ధి పుడకలతో కూడా పోదు అంటారు పెద్దలు. ఆ మాటను ఎందుకు అంటారో ఆదివారం నాటి భారత్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ నిరూపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు చేసిన ప్రదర్శన విమర్శలకు కారణమైంది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. ఎన్నడూ లేనివిధంగా ప్రత్యర్థి జట్టు ఈసారి దూకుడు కొనసాగించింది ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 58 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ జట్టు లో ఆనందం కనిపించింది. షేక్ హ్యాండ్ వివాదం తర్వాత అప్పర్ హ్యాండ్ కొనసాగించామని గొప్పలు పోయింది. వాస్తవానికి భారత జట్టు ఫీల్డింగ్ లోపాలు పాకిస్తాన్ జట్టుకు అనుకూలంగా మారాయి. భారత ప్లేయర్లు కొన్ని క్యాచ్ లు నేలపాలు చేయడంతో పాకిస్తాన్ ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. భారీగా పరుగులు రాబట్టారు. దీంతో పాకిస్తాన్ స్కోర్ ఏకంగా 171 పరుగులకు చేరుకుంది. వాస్తవానికి భారత బౌలర్లు గనుక కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది…

పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. బౌలర్ ఎవరనేది సంబంధం లేకుండా మెరుపు వేగంతో పరుగులు తీశాడు. ఫోర్లు, సిక్సర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అతడు బ్యాట్ తో బేరింగ్ సెలబ్రేషన్ మాదిరిగా హావభావాలు ప్రదర్శించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసి ప్రపంచాన్ని జయించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని.. ఇటువంటి ఎక్స్ట్రాలు తగ్గించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఫైరింగ్ సెలబ్రేషన్ కూడా భారత డగ్ ఔట్ ను సూచిస్తూ చేయడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ” ఇటీవల పహల్గాం దాడిలో భారతీయులు చనిపోయారు. ఉగ్రవాదులు ఇదే స్థాయిలో కాల్పులు జరిపారు. పాకిస్తాన్ ఆటగాడి వ్యవహారం కూడా అలానే ఉంది. దేశానికి తగ్గట్టుగానే ఆటగాడి తీరు ఉంటుందని” భారత అభిమానులు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper