Naveen Polishetty : యంగ్ హీరోల్లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో నవీన్ పోలిశెట్టి. కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాదు , ఆఫ్ స్క్రీన్ లో కూడా నవీన్ పోలిశెట్టి చాలా సరదాగా ఉంటారు. అందుకే ఈయనకు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్. చేసింది కేవలం 5 సినిమాలే అయినా , బ్రాండ్ మాత్రం వేరే లెవెల్ లో ఏర్పడింది. ఆయన సినిమా వచ్చిందంటే చాలు , డైరెక్టర్ ఎవరు అనేది చూడరు , కళ్ళు మూసుకొని టికెట్స్ బుక్ చేసేస్తుంటారు ఆడియన్స్. అయితే ఇన్ని రోజులు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నవీన్ పోలిశెట్టి, తన తదుపరి చిత్రం లో సీరియస్ రోల్ లో నటించబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నేడు ఒక ఈవెంట్ లో ప్రకటించారు. మల్కాజ్ గిరి కమీషినర్ కమిషనరేట్ నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి , సీపీ సుమతి పై సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో నేను ఈ స్టేజి మీద నిలబడి మాట్లాడడం చూస్తుంటే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తోంది. ‘ఏమి ఫీల్ ఉన్నాది మామా ఇక్కడ’.. మీరందరు సుమతి మేడం వీడియో ఒకటి వచ్చింది రీసెంట్ గా చూశారా ?, నేను మా ఆఫీస్ టీం అందరం ఇటీవలే ఆ వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఏమి యాక్టింగ్ చేశారు మేడం మీరు. మీ పోలీసులందరూ సుమతి మేడం ని రిక్వెస్ట్ చేయండి , ఆమెని నా తదుపరి చిత్రం లో నటించమని. నేను , సుమతి సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ లో నటించాలని నా కోరిక. నా తదుపరి చిత్రం లో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నాను . సజ్జనార్ సార్ , నాకు ఒకసారి గన్ పట్టుకోవడం నేర్పించాలి మీరు, ఖాళీ ఉన్నప్పుడు చెప్తే మీ దగ్గరకు వస్తాను ట్రైనింగ్ కోసం’ అంటూ నవీన్ పోలిశెట్టి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

