Bajaj : మనదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే టూవీలర్ కంపెనీలలో ఒకటైన బజాజ్, తన వినియోగదారుల కోసం ఇప్పుడు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ మార్కెట్లోకి రావడంతో ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి ప్రముఖ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కొత్త స్కూటర్ చేతక్ 35 సిరీస్‌లో అత్యంత తక్కువ ధర కలిగిన వేరియంట్. దీనికి చేతక్ 3503 అని పేరు పెట్టారు.
కొత్త బజాజ్ చేతక్ 3503 ఇతర వేరియంట్ల మాదిరిగానే మెకానికల్, బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇందులో 3.5 kWh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 155 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో 35 లీటర్ల పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. దీని హయ్యెస్ట్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లను కంపెనీ సెట్ చేసింది. ఇది ఇతర ట్రిమ్‌లతో పోలిస్తే చాలా తక్కువ.
Also Read : రూ.20,000 తక్కువ.. 155కిమీ రేంజ్.. బజాజ్ కొత్త చేతక్ అదుర్స్!
కొత్త చేతక్ 3503 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇతర వేరియంట్‌లతో పోలిస్తే కొన్ని తక్కువగా ఉన్నాయి. ఈ మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఒక బేసిక్ LCD డిజిటల్ కన్సోల్ ఉంటుంది. ఈ స్కూటర్ 0 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి మూడున్నర గంటట సమయం పడుతుంది. ఇది ఇతర మోడళ్ల కంటే కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చచు. ఇందులో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా లేవు. దీనిలో ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను పొందుతారు. హిల్-హోల్డ్ అసిస్ట్, ఫుల్ మెటల్ బాడీ ఉణ్నాయి. చేతక్ 3503 నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మ్యాట్ గ్రే.
కొత్త బజాజ్ చేతక్ 3503 డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీని అర్థం 2.9 kWh బ్యాటరీ ప్యాక్, 123 కిలోమీటర్ల రేంజ్‌తో ఉన్న చేతక్ 2903 రాబోయే నెలల్లో ఉత్పత్తి నిలిచిపోవచ్చు. ఈ మోడల్ చేతక్ బడ్జెట్ వెర్షన్. దీని ధర రూ.98,498 (ఎక్స్-షోరూమ్). కొత్త బజాజ్ చేతక్ 3503 ఈ విభాగంలో Ola S1 X+, TVS iQube 3.4, Ather Rizta S, Ampere Nexus వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. చేతక్ భారతీయ ఈ-స్కూటర్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది.
కొత్త చేతక్ 3503 ధర విషయానికి వస్తే.. ఇది దాని వేరియంట్ చేతక్ 3502 (రూ.1.22 లక్షలు) కంటే దాదాపు రూ.12,000, చేతక్ 3501 (రూ.1.30 లక్షలు) కంటే రూ.20,000 తక్కువ ధరతో వస్తుంది. బజాజ్ చేతక్ 3503 ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పుడు కంపెనీ అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారింది. అయితే, కంపెనీ ధరను తగ్గించడానికి ఫీచర్లలో కొన్ని కోత విధించింది.
Also Read : ఓలా, ఏథర్‌లు సైలెంట్.. బజాజ్ చేతక్ మాత్రం ఫుల్ సౌండ్!