
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం ఒంగోలు పార్లమెంటు జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావశంలో జిల్లా పరిధిలోని సాగు, తాగు నీటి సమస్యల గురించి, పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు, జిల్లా ఇంచార్జి నాగోతు రమేష్ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.