
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత అవసరాల నిమిత్తం వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఆంపియర్ కంపెనీ శుభవార్త చెప్పింది. స్కూటర్ ధరను భారీగా తగ్గిస్తూ ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్కూటర్ ధర ఏకంగా 27,000 రూపాయల వరకు తగ్గడం గమనార్హం.
ఆంపియర్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర భారీగా తగ్గించింది. ఈ కంపెనీ మాగ్నస్ మోడల్ ధర 47,990 రూపాయలుగా ఉండగా గతంలో ఇదే స్కూటర్ ధర 74,990 రూపాయలుగా ఉంది. గతంలో 68,990 రూపాయలుగా ఉన్న జీల్ మోడల్ ధర ప్రస్తుతం 41,990 రూపాయలుగా ఉంది. రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనాల ధరలు రాష్ట్రాల ప్రాతిపదికన మారతాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను సవరించిన నేపథ్యంలో వాటి ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే రాబోయే రోజుల్లో స్కూటర్ల ధరలు పెరిగే అవకాశాలు సైతం ఉన్నాయని చెప్పవచ్చు. అందువల్ల కొత్తగా స్కూటర్ ను కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిది.
ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడటం వల్ల పర్యావరణానికి మేలు చేయడంతో పాటు పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సమీపంలోని షోరూంను సంప్రదించి ఈ స్కూటర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.