Homeక్రీడలుFIFA 2026 Morocco vs Brazil : మొరాకో కొట్టిన దెబ్బ అలాంటిది మరి.. పాపం...

FIFA 2026 Morocco vs Brazil : మొరాకో కొట్టిన దెబ్బ అలాంటిది మరి.. పాపం బ్రెజిల్

FIFA 2026 Morocco vs Brazil : ఫిఫా లో ఇప్పటివరకు సంచలనాలు నమోదు కాలేదు. కానీ మొరాకో చేసి చూపించింది.. దీంతో ఫిఫా కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పరిస్థితి దారుణంగా మారింది.. బ్రెజిల్ జట్టును మొరాకో నిలువరించి చుక్కలు చూపించింది.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరుగుతుందని.. బ్రెజిల్ ఘన విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను మొరాకో తలకిందులు చేసింది. 17 సార్లు […]

FIFA 2026 Morocco vs Brazil : ఫిఫా లో ఇప్పటివరకు సంచలనాలు నమోదు కాలేదు. కానీ మొరాకో చేసి చూపించింది.. దీంతో ఫిఫా కప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బ్రెజిల్ పరిస్థితి దారుణంగా మారింది.. బ్రెజిల్ జట్టును మొరాకో నిలువరించి చుక్కలు చూపించింది.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా జరుగుతుందని.. బ్రెజిల్ ఘన విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను మొరాకో తలకిందులు చేసింది.

17 సార్లు విజేత

ఫిఫా లో బ్రెజిల్ 17 సార్లు విజేత.. 1934 నుంచి ఆ జట్టు ఫిఫాలో ఇప్పటివరకు సత్తా చూపిస్తూనే ఉంది. 17 సార్లు ట్రోఫీలు అందుకుందంటే ఆ జట్టులో ఆటగాళ్ల స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది.. అయితే ఆ జట్టులో కీలకమైన ఆటగాడు నెయ్ మార్ లేడు. గాయం వల్ల అతడు కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉంటాడని మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతడు లేకుండానే బ్రెజిల్ రంగంలోకి దిగింది. అయితే మొరాకో ఇచ్చిన షాక్ కు బ్రెజిల్ కు దిమ్మ తిరిగిపోయింది.

మొరాకోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ నిర్ణీత సమయంలో ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మొరాకో కూడా ఒకే ఒక్క గోల్ చేయగలిగింది. మరోవైపు బ్రెజిల్ ఆటగాళ్లు ఇంకో గోల్ చేయకుండా మొరాకో ప్లేయర్లు అడ్డుకోగలిగారు. గోల్ పోస్ట్ మీద పదేపదే దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ మొరాకో ప్లేయర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు.. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయింది.

ఈ మ్యాచ్ డ్రా అయింది అనేకంటే బ్రెజిల్ ఓడిపోయింది అని చెప్పడం సబబు. ఎందుకంటే ఆట తీరు.. అటాకింగ్.. డిఫెన్స్.. బాల్ పాసింగ్.. ఇలా ఏ విషయంలో కూడా మొరాకో బ్రెజిల్ జట్టుతో సరితూగదు.. కానీ మొరాకో జట్టు అంచనాలకు మించి ఆకట్టుకుంది. ఆ జట్టు ప్లేయర్లు అవిశ్రాంతంగా పోరాటాన్ని సాగించారు. మైదానంలో కట్టుదిట్టంగా కదిలారు. బ్రెజిల్ ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అదరగొట్టారు. ఫలితంగా ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్.. చివరికి డ్రా అయింది. అంతేకాదు బ్రెజిల్ ఆశల మీద నీళ్లు చల్లింది. సంచలన ఆట తీరితో ఆకట్టుకున్న మొరాకో.. ఆ దేశ అభిమానుల ప్రేమను చూరగొన్నది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper