Homeటాప్ స్టోరీస్Journalism : జర్నలిజంలో ఇదో కొత్త వింత.. ఆ పత్రిక జర్నలిస్టులకు ‘శిక్ష’ణ

Journalism : జర్నలిజంలో ఇదో కొత్త వింత.. ఆ పత్రిక జర్నలిస్టులకు ‘శిక్ష’ణ

Journalism : ఓరియంటేషన్.. కొద్దిరోజులుగా ఆ పత్రికా యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్వహిస్తోంది. ఓరియంటేషన్ ఉంటే ఒక సంస్థలో కొత్తగా ప్రవేశించిన ఉద్యోగులకు.. సంస్థ నిబంధనలు.. పనిచేసే విధానం.. పని పరిస్థితుల గురించి వివరించడం.. వాస్తవానికి ఆ పత్రిక యాజమాన్యం ఇలా నిర్వహించడం జర్నలిజం సర్కిల్స్ లో సరికొత్త చర్చకు కారణం అవుతుంది. ఎందుకంటే ఆ పత్రిక యాజమాన్యం ఇప్పటికిప్పుడు ఓరియంటేషన్ ఎందుకు నిర్వహిస్తోంది.. నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది.. నిర్వహిస్తే పాత్రికేయులకు లభించే ప్రయోజనం […]

Journalism : ఓరియంటేషన్.. కొద్దిరోజులుగా ఆ పత్రికా యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్వహిస్తోంది. ఓరియంటేషన్ ఉంటే ఒక సంస్థలో కొత్తగా ప్రవేశించిన ఉద్యోగులకు.. సంస్థ నిబంధనలు.. పనిచేసే విధానం.. పని పరిస్థితుల గురించి వివరించడం.. వాస్తవానికి ఆ పత్రిక యాజమాన్యం ఇలా నిర్వహించడం జర్నలిజం సర్కిల్స్ లో సరికొత్త చర్చకు కారణం అవుతుంది. ఎందుకంటే ఆ పత్రిక యాజమాన్యం ఇప్పటికిప్పుడు ఓరియంటేషన్ ఎందుకు నిర్వహిస్తోంది.. నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది.. నిర్వహిస్తే పాత్రికేయులకు లభించే ప్రయోజనం ఏమిటి.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

ఆ పత్రిక ఏర్పాటు జర్నలిజాన్ని ఉద్ధరించడానికి కాదు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి కాదు. పాత్రికేయుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురావడానికి అంతకంటే కాదు. కేవలం ఆ పత్రిక ఒక పార్టీకి కరపత్రిక. నిజాలతో సంబంధం లేదు. కేవలం అబద్దాల పునాదుల మీద మాత్రమే ఆ పత్రిక నడుస్తోంది. గతంలో ఆ పత్రిక యాజమాన్యం ఓ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ పత్రిక యజమాని తండ్రి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇన్ని రకాలుగా సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు తక్కువే అని చెప్పాలి. పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రిక యాజమాన్యం ఉద్యోగులకు గొప్పగా మేలు గాని.. సౌకర్యాలు గాని కల్పించిన దాఖలాలు లేవు. పత్రికను ప్రారంభించిన తొలి రోజుల్లో గొప్పగా జీతాలు ఇచ్చేవారు. ఉద్యోగులను బస్సులో తీసుకెళ్లేవారు. క్యాంటీన్లో రకరకాలుగా సదుపాయాలు కల్పించేవారు. మొదట్లో ఈ హంగామా బాగానే నడిచేది. ఆ తర్వాత కాస్ట్ కటింగ్ పేరుతో ఇవన్నీ కూడా తొలగిపోయాయి. చాలామంది ఉద్యోగులను కూడా మేనేజ్మెంట్ తొలగించింది. ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు పని చేస్తోంది. వారంతా కూడా సంవత్సరాలుగా అదే సంస్థలో పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఆ పత్రిక యాజమాన్యానికి ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. పైగా ఉద్యోగులలో కూడా పెద్దగా భరోసా లేదు. అలాంటప్పుడు పత్రిక యాజమాన్యం ఓరియంటేషన్ క్లాసులు పెడితే ప్రయోజనం ఏముంది. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు.. ఇతర సదుపాయాలు కల్పించినప్పుడే వారు యాజమాన్యం మీద నమ్మకాన్ని కలిగి ఉంటారు. మరింత గొప్పగా పనిచేస్తూ ఉంటారు. యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించినప్పుడు.. బండెడు చాకిరి భుజాల మీద మోస్తున్నప్పుడు.. యాజమాన్యం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్ పెడితే ప్రయోజనం ఏమంటుంది. గతంలో ఆ పత్రికలో పెద్ద తలకాయలు భారీగా జీతాలు తీసుకున్నాయి. ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టి తొలగించాయి. ఇప్పుడు ఆ పెద్ద తలకాయలకు వచ్చిన ఆలోచన ఓరియంటేషన్ క్లాస్. దీనివల్ల యాజమాన్యానికి టీ ఖర్చులు.. బిస్కెట్ల ఖర్చులు తప్ప పెద్దగా ఉపయోగ ఉండదు. ఎందుకంటే పార్టీకి కరపత్రంగా మారిన ఆపత్రిక.. ఎప్పటికీ ప్రజాస్వామ్య విలువలను అందుకోలేదు. నాలుగో స్తంభాలాగా నిలబడలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper