spot_img
Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 points table analysis : ఆ జట్లు గెలిచాయి.. టాప్- 4 జట్ల...

IPL 2026 points table analysis : ఆ జట్లు గెలిచాయి.. టాప్- 4 జట్ల కూసాలు కదిలాయి.. ఈసారి ఐపీఎల్ మామూలుగా లేదు..

IPL 2026 points table analysis : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి సంచలనాల మీద సంచలనాలు నమోదు అవుతున్నాయి.. 200కు పైగా స్కోర్ కూడా సరిపోడం లేదు. ప్లేయర్లు సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నారు. ప్లాట్ మైదానాల మీద పరుగుల ప్రవాహాన్ని సాగిస్తున్నారు. అలాగని బౌలర్లు తక్కువ తినలేదు. పచ్చిక ఉన్న మైదానాల మీద అద్భుతంగా బంతులు వేస్తున్నారు. వికెట్ల మీద వికెట్లు తీస్తున్నారు. ఫలితంగా బ్యాట్, బంతి మధ్య సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది.

ఐపీఎల్ లో ఇప్పటివరకు దాదాపు సగానికి మించి మ్యాచులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లు కూడా ఇప్పటివరకు స్థిరమైన ప్రదర్శన చేశాయి. పరుగుల వరద సాగించాయి. వికెట్ల వేటను కూడా అదే స్థాయిలో చూపించాయి. అయితే ఈ జట్లు కొద్దిరోజులుగా ఇబ్బంది పడుతున్నాయి. ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓటమిపాలైంది. మే 3న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో పంజాబ్ ఓటమిపాలైంది.

ఈ ఓటమీ ఆ నాలుగు జట్ల పరిస్థితిని ఏ మాత్రం మార్చకపోయినప్పటికీ.. ఐపీఎల్ లో ఏదైనా జరుగుతుందని సంకేతాలను ఇచ్చింది. గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జోరు చూపిస్తున్నాయి. ఈ నాలుగు జట్లు కూడా బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆడుతున్నాయి. ఈ నాలుగు జట్లలో ఢిల్లీ మినహా మిగతావన్నీ ఐపీఎల్ ట్రోఫీలు సాధించినవే. ఈ జట్లు ఈసారి కూడా అంతకుమించి అనే స్థాయిలో ఆట తీరు కొనసాగిస్తే.. టాప్ 4 స్థానాలు మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది అనిశ్చితికి మారుపేరు. అలాంటప్పుడు ఈసారి కూడా ఫలితాలు తారు మారయ్యే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఐపీఎల్ లో బంతి బంతికి సమీకరణం మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక జట్టు మాత్రమే గెలుస్తుందని అంచనా వేయడం కరెక్ట్ కాదు. అందువల్లే ఈసారి ఐపీఎల్లో కూడా కొన్ని జట్లు ప్రధమార్థంలో గొప్ప ఆట తీరు కొనసాగించాయి. ఆ తర్వాత వెనకడుగు వేస్తున్నాయి. ప్రధమార్థంలో ఇబ్బంది పడిన జట్లు.. ఇప్పుడు అదరగొడుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈసారి పోరు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ టాప్ 4 లో జట్లు అద్భుతమైన ఆటతీరు కొనసాగిస్తే సమీకరణాలు అదేవిధంగా ఉంటాయి. మిగతా జట్లు అదరగొడితే అప్పుడు ఫలితాలు మారిపోతాయి..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper