Homeఆంధ్రప్రదేశ్‌Jagapathi Babu comments on Jagan: జగపతిబాబు అన్నది జగన్ కేనా

Jagapathi Babu comments on Jagan: జగపతిబాబు అన్నది జగన్ కేనా

Jagapathi Babu comments on Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో సినీ పరిశ్రమకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన హయాంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవడంతో సహజంగానే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అయింది అప్పట్లో. ఈ నేపథ్యంలో చాలామంది బాహటంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. మొన్నటి ఎన్నికల్లో సినీ పరిశ్రమ వ్యతిరేకత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక కారణం. చాలామంది నటులు కూటమిని గెలిపించాలని […]

Jagapathi Babu comments on Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) విషయంలో సినీ పరిశ్రమకు ఒక అభిప్రాయం ఉంది. ఆయన హయాంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవడంతో సహజంగానే ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అయింది అప్పట్లో. ఈ నేపథ్యంలో చాలామంది బాహటంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. మొన్నటి ఎన్నికల్లో సినీ పరిశ్రమ వ్యతిరేకత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఒక కారణం. చాలామంది నటులు కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకరిద్దరు అయితే ప్రచారంలో కూడా పాల్గొన్నారు. చాలామంది జగన్ వైఖరిని బాహటంగానే తప్పుపట్టారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ జగపతిబాబు జగన్మోహన్ రెడ్డి పై పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. జగపతిబాబు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు కానీ.. అలానే అర్థం వచ్చేలా మాట్లాడినట్టు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఎవరి మాట వినే రకం కాదు..
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే పరిస్థితి ఉండేది కాదన్నది అప్పట్లో వచ్చిన ఒక కామెంట్. తన పార్టీలో తండ్రి రాజశేఖరరెడ్డి సమకాలీకులు ఉండేవారు. చాలామంది సన్నిహితులు సైతం సలహాలు ఇచ్చేవారు. వారి మాటలను అస్సలు పట్టించుకునే వారు కాదట జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ విమర్శ సొంత పార్టీ నుంచి వినిపించేది. ఏకపక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకునేవారు. వ్యతిరేకత వచ్చిన పునసమీక్షించేవారు కాదు. కనీసం దానిపై మాట్లాడే వారు కూడా కాదు. అప్పట్లో సినీ పరిశ్రమకు సంబంధించి టికెట్ల ధర పెంపు, థియేటర్ల నిర్వహణపై అధికారుల దాడులతో బెంబేలెత్తించారు. చేజేతుల సినీ పరిశ్రమకు అప్పట్లో వ్యతిరేకం అయ్యారు. అందుకే సినీ పరిశ్రమ 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ఎక్కువగా కోరుకుంది. అనుకున్నట్టుగానే అది జరిగిపోయింది.

యూట్యూబ్ ఇంటర్వ్యూలో..
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో జగపతిబాబు( cine actor Jagapathi Babu) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వెధవ ఉన్నాడు.. వాడు తప్పు చేస్తుంటాడు.. తప్పుల మీద తప్పులు చేస్తుంటాడు. కానీ ఎవరూ చెప్పలేరు అంటూ జగపతిబాబు కామెంట్స్ అందులో ఉన్నాయి. కానీ జగపతిబాబు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసమే జగపతిబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రోల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper