spot_img
Homeక్రీడలుIndia U19 vs Afghanistan U19 : భారత్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్..

India U19 vs Afghanistan U19 : భారత్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్..

India U19 vs Afghanistan U19 : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ జట్టును ఓడించి సెమి ఫైనల్ వెళ్ళింది. సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది. బుధవారం హరారే మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఆఫ్గనిస్తాన్. భారత జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో సీనోజాదా (110), ఉజారుల్లా నియా జాయ్(101*) సెంచరీలతో కదం తొక్కడంతో ఆఫ్గనిస్తాన్ జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ 53 పరుగుల వద్ద కోల్పోయింది. రెండో వికెట్ 117 పరుగుల వద్ద కోల్పోయింది. కానీ మూడో వికెట్ కు మాత్రం రికార్డు స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పరుగులు నమోదు చేశారు. మూడో వికెట్ కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో ఆఫ్గానిస్తాన్ జట్టు తిరుగులేని స్థాయిలో నిలిచింది.

మొదటి రెండు వికెట్లను సమర్థవంతంగా తీయగలిగిన భారత బౌలర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరి రెండు వికెట్లు సాధించారు. మొదట్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. కానీ ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ బ్యాటర్ల మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ ఎదుట ఆఫ్ఘనిస్తాన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలవాలంటే 311 పరుగులు చేయాలి. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్య వంశీ, ఆయుష్ మాత్రే, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు మీద జట్టు ఆశలు పెట్టుకుంది. వీరంతా సమిష్టిగా ఆడితేనే టీమిండియా విజయం సాధిస్తుంది. లేనిపక్షంలో భారత అభిమానులు బిత్తరపోయే ఫలితం వస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper