Homeటాప్ స్టోరీస్BRS Yuva Sangrama Sabha : బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ.. చివరికిలా ముగిసింది..

BRS Yuva Sangrama Sabha : బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ.. చివరికిలా ముగిసింది..

BRS Yuva Sangrama Sabha : గొప్పగా ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా వీడియోలు రూపొందించారు. ఇక డిజిటల్ పోస్టర్ల కైతే ఏ మాత్రం తక్కువ లేదు. ఈ సభ ద్వారా అన్ ఎంప్లాయ్ మెంట్ యూత్ కు ఒక భరోసా లభిస్తుందని.. యువతకు ఒక నమ్మకం దక్కుతుందని గులాబీ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకుంది. పైగా దీనికి యువ సంగ్రామ సభ అని పేరు పెట్టింది. సరూర్నగర్ లో నిర్వహించింది. భారీగా టెంట్లు.. గులాబీ […]

BRS Yuva Sangrama Sabha : గొప్పగా ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా వీడియోలు రూపొందించారు. ఇక డిజిటల్ పోస్టర్ల కైతే ఏ మాత్రం తక్కువ లేదు. ఈ సభ ద్వారా అన్ ఎంప్లాయ్ మెంట్ యూత్ కు ఒక భరోసా లభిస్తుందని.. యువతకు ఒక నమ్మకం దక్కుతుందని గులాబీ పార్టీ గట్టిగా ప్రచారం చేసుకుంది. పైగా దీనికి యువ సంగ్రామ సభ అని పేరు పెట్టింది. సరూర్నగర్ లో నిర్వహించింది. భారీగా టెంట్లు.. గులాబీ కార్యకర్తలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.

సభను గొప్పగా చేద్దామని.. గొప్ప సందేశం ఇద్దామని గులాబీ పార్టీ ముందుగానే నిర్ణయించుకుంది. అన్ని దినుసులు కుదిరినప్పటికీ.. చివర్లో ఉప్పు వేయకపోతే వంటకం ఎలా అయిపోతుందో.. ఈ గులాబీ పార్టీ యువ సంగ్రామ సభ కూడా అలానే అయిపోయింది.. గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు గొప్పగానే స్పీచ్ రాసుకొని.. గట్టిగానే మాట్లాడినప్పటికీ.. అది హడావిడిగానే మిగిలిపోయింది. ఆశించిన మైలేజ్ రాలేదని చర్చ నడుస్తోంది.

ఈ సభకు భారీ ఎత్తున హంగామా సృష్టించడానికి గులాబీ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. గులాబీ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది. అయితే పోలీసులు తమ ఎవరిని కూడా ముందస్తు గృహ నిర్బంధంలోకి తీసుకోవడం లేదని చెప్పడంతో.. గులాబీ పార్టీకి ప్రారంభంలోనే దెబ్బ తగిలింది. భారీ హంగామా ఉంటుందని కొని.. ట్రాఫిక్ జామ్ అవుతుందని ముందుగానే గులాబీ పార్టీ చెప్పింది. కానీ సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి సాఫీగానే అందరు వెళ్లారు.. అయితే ఈ సభకు నిరుద్యోగులు వస్తారు అనుకుంటే.. కేవలం గులాబీ పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చారు.

ఇక కేటీఆర్ వేదిక మీద నిరుద్యోగులకు భరోసా ఇవ్వకుండా కేవలం రేవంత్ రెడ్డిని తిట్టడానికి మాత్రమే సమయం కేటాయించారు. రాజకీయంగా విమర్శలు చేశారు. ఇకపై లెక్క ఒకరకంగా ఉంటుందని.. జంగు సైరన్ మోగించడానికి యంగ్ తరంగ్ వచ్చిందని నినాదాలు చేశారు.. తెలంగాణ ఉద్యమంలో నాడు యువత పోషించిన పాత్రను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 38 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీ దగా అని ఆరోపించారు.. కాంగ్రెస్ నాయకులను పాతకేటుగాళ్లు.. కొత్త డూప్లికేట్ గాళ్లు అంటూ కేటీఆర్ విమర్శించారు.. రాహుల్ గాంధీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ మోసం అంటూ కేటీఆర్ ఆరోపించారు.. తెలంగాణలో నోటిఫికేషన్ లు కావని లూటిఫికేషన్ నడుస్తోందని.. ఉద్యోగాల మేళా కాకుండా.. కుంభకోణాల మేళా నడుస్తోందని ఆరోపించారు.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 26 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కల్పించుకున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. నాడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ని ప్రభుత్వం పట్టుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 70,000 శాశ్వత ఉద్యోగాలు కనుక ఇచ్చినట్లయితే తాను రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.. రేవంత్ రెడ్డిని.. బండి సంజయ్ ని కలిపి కేటీఆర్ తిట్టారు. ఇద్దరినీ కూడా కాపీ బ్యాచ్ అంటూ ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా విక్టోరియా గ్రౌండ్ కి రావాలని సవాల్ చేశారు. ఇలా చాలానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కేటీఆర్. వాస్తవానికి ఆయన మాట్లాడినట్టు ఉప్పెన రాలేదు. ఆయన చెప్పినట్టు సునామీ రాలేదు. జస్ట్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ ఒక సాధారణ రాజకీయ సభ లాగా మిగిలిపోయింది. అన్నట్టు ఈ సభలో హరీష్ రావు కనిపించలేదు. కేవలం కేటీఆర్ మాత్రమే సెంట్రల్ ఫోకస్ అయ్యారు. ఆయన అనుచరులు మాత్రమే వేదిక పంచుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper