Anil Ravipudi Venkatesh movie : సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు… ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే నిలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక పదోవ సినిమాతో కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలు పెట్టి ఆయన చేస్తున్న ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా విజయాన్ని సాధిస్తుందని అతనితో పాటు తన అభిమానులు కూడా భావిస్తున్నారు… ఇక ఇప్పటికే వెంకటేష్ తో నాలుగు సినిమాలను చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో అతన్ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో అతనికి ఒక డిఫెక్ట్ అయితే ఉంటుందట. ఆయన నత్తి మాట్లాడుతూ కనిపిస్తారట. దాంతోనే కామెడీని పండిస్తూ ఒక కొత్త వెంకటేష్ ను మనకు చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి కామెడీని బేస్ చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ సినిమాలో కూడా భారీ కామెడీ ఉండబోతుందట. దానికి తోడుగా యాక్షన్ సన్నివేశాలను కూడా పెద్ద ఎత్తున తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వెంకటేష్ ఇప్పటివరకు నత్తితో తడబడుతూ మాట్లాడే క్యారెక్టర్ లో అయితే కనిపించలేదు.
కాబట్టి ఇది కచ్చితంగా కొత్తగా ఉంటుందని తన సన్నిహిత వర్గాల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి మరోసారి కమర్షియల్ సినిమాలకు పెద్దపీట వేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక అనిల్ రావిపూడి ఈ సంవత్సరం ఇప్పటికే చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే మూవీ చేసి 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక రాబోయే సినిమాతో అంతకు మించిన వసూళ్లను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
