Minister Roja: జబర్దస్త్ జడ్జి రోజా ఇక మంత్రి కావడంతో ఇకపై ఆ షోకూ దూరం కానున్నారు. ఇన్నాళ్లు జబర్దస్త్ అంటేనే రోజాగా వినుతికెక్కిన ప్రోగ్రాం ఇక ఆమె లేకుండానే నెట్టుకు రానుంది. మంత్రి అయిన తరువాత బాధ్యతలు పెరుగుతాయని జబర్దస్త్ కు రావడం లేదని తెలుస్తోంది కానీ కమెడియన్లు అందరు ఆమె ఇక రాదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు దైవంతో సమానమని ఏ తప్పు చేసినా తమను సొంత బిడ్డలుగానే చూసుకున్నారని విలపించారు.
Minister Roja
తన నవ్వులతో అందరిని మైమరపించే రోజా జబర్దస్త్ కు ఓ టానిక్ లా పనిచేశారు. అందరిని సమన్వయం చేసుకుని షోను ఎక్కడికో తీసుకెళ్లడం తెలిసిందే. ఇన్నాళ్లు అందరితో కలివిడిగా మసలుకున్న ఆమెకు మంత్రి పదవి వరించడంతో ఇక తాను జబర్దస్త్ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చింతించారు. అందరిని పట్టుకుని ఏడ్చారు.
Also Read: Sai Ganesh Suicide Issue: బీజేపీ నేతల చావులను ‘కులం’ కార్డుతో కవర్ చేస్తారా?
జబర్ధస్త్ టీం చివరి కోరికను మంత్రి రోజా తీరుస్తుందా?
మల్లెమాల ప్రొడక్షన్ కు తానెంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె కన్నీరు కార్చడం తెలిసిందే. ఈ మేరకు సుడిగాలి సుధీర్ రోజా గారు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. రోజా కాళ్లపై పడి ఆశీర్వాద తీసుకున్నాడు. అనంతరం ఆటో రాంప్రసాద్ సైతం తనకు రోజా మేడం లైఫ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తనకు ఆటో రాంప్రసాద్ అని పేరు పెట్టింది కూడా రోజాగారే అని బాధాతప్త హృదయంతో అన్నాడు.
Minister Roja
ఇక్కడే ఇదే స్టేజీ మీదే ఎమ్మెల్యే అయ్యాను. తరువాత మంత్రి కూడా అయ్యాను. మల్లెమాల తనకు ఎంతో జీవితం ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇంతటి బంగారు అవకాశాలను ఇచ్చిన మాతృసంస్థను ఎప్పటికి మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. మరో జీవితం ఉంటే మల్లెమాలకే తన సేవలు అందజేస్తానని చెప్పడం గమనార్హం. రోజా తన జీవితంలో అన్ని అవకాశాలను ఇచ్చిన ఘనత మల్లెమాలకే దక్కుతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా మల్లెమాల ప్రొడక్షన్ మరో జడ్జిని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read:Jeevitha Rajasekhar: మోసం చేసి.. బుకాయిస్తే ఎలా జీవిత గారు ?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Jabardasth team wants minister roja to come again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com