రాష్ట్రంలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తమకు పెద్ద ఘనతగా ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోవడంతో దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం తక్కువే. ఈ ఉత్తర్వులపై హైకోర్టు రిట్ దాఖలు అయ్యింది.
విజయవాడకు చెందిన న్యాయవాది సి.హెచ్ వరలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది జి.ఆదినారాయణ ఈ అంశాలపై తన వాదనలు వినిపించారు. ఈ విషయమై పారిశ్రామికవేత్తలే పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుమంత్ రెడ్డి వాదించారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
దీనిపై తమ వాదనలు వినిపించేందుకు, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని సుమంత్ రెడ్డి కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ అంశంపై విచారణలో ప్రజాప్రయోజనం ఉందని ధర్మాసనం భావించిందని అందుకే విచారణకు అనుమతించినట్లు చెప్పింది. రాజ్యాంగ పరిధిలోకి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Writ petition filed against ap govt regarding 75 reservation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com