ప్రపంచబ్యాంక్ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ.. లాక్ డౌన్ విధింపుతో గతంలో ఎన్నడూ చూడని దారుణ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు భారత్ లో కనిపిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏసియా చీఫ్ ఎకనామిస్ట్ హాన్స్ టిమ్మర్ అన్నారు. ప్రపంచంలోనే భారత్ అతి సుధీర్ఘ, కఠినమైన లాక్ డౌన్ భారత్ లో విధించారని.. అందుకే వృద్ధి రేటు ఏకంగా -23.9శాతం దిగజారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణ పతన దిశలో ఉందని ప్రపంచబ్యాంక్ అభిప్రాయపడింది.
Also Read: జనహృదయ నేత, దళిత గొంతుక రామ్ విలాస్ పాశ్వాన్ స్పెషల్ స్టోరీ!
భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి వేగవంతమైన , సమగ్రమైన చర్యలు తీసుకోవాలని.. అప్పుడే భారత్ లో పేదరికాన్ని తగ్గించడానికి ఇన్నాళ్లు కష్టపడి నిలబెట్టుకున్న వృద్ధిని తిరిగి అందుకోవడానికి సాధ్యం అవుతుందని పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు భారత్ కీలక సంస్కరణలను కొనసాగించాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. కరోనా విధ్వంసంతో దక్షిణాసియా తీవ్ర మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని పేర్కొంది. 2020లో ఈ ప్రాంత వృద్ధి 7.7 శాతం తగ్గుతుందని అంచనావేసింది.
కరోనా వైరస్ ఎంట్రీతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రపంచదేశాలన్నీ కుదేలయ్యాయి. జీడీపీ మైనస్ లలోకి జారిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు ప్రపంచ బ్యాంకు కీలక సూచనలు చేసింది. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 9.6 శాతం మేర ప్రతికూలత నమోదు చేయవచ్చని పేర్కొంది. 2022 సంవత్సరంలో పుంజుకొని 5.4శాతం వృద్ధి నమోదు చేయవచ్చునని అంచనావేసింది. కరోనా మహమ్మారి నియంత్రణలు 2022 నాటికి పూర్తిగా తొలిగిపోతాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
Also Read: గాంధీ కుటుంబం ఇంతగా బరితెగించిందా?
దీన్ని బట్టి దేశంలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితి నుంచి దేశం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని అన్ని సర్వేలు, ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. 2020కి కానీ భారత్ లో సాధారణ పరిస్థితులు, ఆర్థికంగా కోలుకునే పరిస్థితి లేదని అర్థమవుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Worse conditions will the countrys economy recover in 2020
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com