
కరోనా వైరస్ సగటు మానవుని జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎప్పుడూ రాని కష్టాలను తెచ్చిపెట్టింది. కరువు కాలంలోనూ గట్టెక్కిన మనిషికి కరోనాతో మాత్రం పూట గడవని పరిస్థితి దాపురించింది. ఈచోట.. ఆచోట.. అని కాకుండా దాదాపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో కుదేలయింది. అయితే ఈ వైరస్ ధాటికి కొన్ని దేశాలు తట్టుకొని తిప్పుకొడుతుండగా మరికొన్ని దేశాలు మాత్రం వైరస్ గురించి పట్టించుకోవడం లేదు. కనీస జాగ్రత్తలు తెలపడం లేదు. అవగాహన కార్యక్రమాలు అసలే లేవు. ఆ దేశాల్లో గల్ఫ్‌కి చెందినవి ఎక్కువగా ఉన్నారు.
Also Read: దారుణ పరిస్థితులు: 2020లో కానీ దేశం ఆర్థికంగా కోలుకోదా?
ఉపాధి కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన కార్మికులు కరోనాబారిలో చిక్కుకున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడు కరోనా సోకిందంటే పెద్దగా భయపడడం లేదు. కానీ గల్ఫ్ దేశాల్లో మాత్రం కరోనా అంటిందంటే కష్టమే అనే పరిస్థితి దాపురించింది. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కరోనా సోకి వలస కార్మికులను అస్సలు పట్టించుకోవడం లేదు. మెడిసిన్ కాదు కదా కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని తెలుగు రాష్ట్రాల కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా.. పూర్తిస్థాయిలో లేవని వారంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దాదాపు 25 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో జీవిస్తున్నారు. సౌదీ, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్‌లలో ఎక్కువగా తెలుగు కుటుంబాలున్నాయి. ఇక కుటుంబాలను వదిలి ఒంటరిగా జీవించేవాళ్లు ఎందరో ఉన్నాయి. ఇటీవల బహ్రెయిన్ మినహా మిగతా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. సౌదీ, యూఏఈ, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
అప్పో సప్పో చేసి కుటుంబాన్ని వదిలి జీవిస్తున్న వారికి ఇప్పుడు కరోనా కష్టాలు తోడయ్యాయి. కరోనా సోకిన వారిని పనుల్లోకి రానివ్వడం లేదు. ఒకవేళ వచ్చి తగ్గినా వారితో కొన్ని కంపెనీలు రాజీనామాలు చేయిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా స్థాయి తగ్గినా నష్టాలను తట్టుకోలేక మరికొన్ని చమురు సంస్థలు కంపెనీలను మూసివేశాయి. ఇక ఉన్న సంస్థల్లో కొందరు తప్ప మిగతావి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు.దీంతో తమ బతుకులు ఎటు వెళ్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘అదిరింది’ షోపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి జీసీసీ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కార్యకలాపాలు నిలిచిపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో కార్మికులను తప్పక తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనుల్లేక.. ఆకలికి అలమటిస్తూ దయనీయ జీవనం గడుపుతున్నామని వలసకార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఉద్యోగాలు ఉన్న కంపెనీలు జీతాల్లో కోత విధించడంతో వారి పరిస్థితీ ఆగమ్యగోచరంగా మారింది.