Homeజాతీయ వార్తలుWest Bengal Assembly Elections 2026: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. దీదీ దిమ్మ తిరిగే ప్లాన్‌...

West Bengal Assembly Elections 2026: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. దీదీ దిమ్మ తిరిగే ప్లాన్‌ వేసిన బీజేపీ..!

West Bengal Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటికన్నా కీలకమైనది పశ్చిమబెంగాల్‌. ఇక్కడ 15 ఏళ్లుగా తృణమూల్‌ పాలన కొనసాగుతోంది. నాలుగోసారి ఎన్నిక కావడానికి మమత సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో మమత ఓడిపోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ తెలిపాయి. కానీ మమత హ్యాట్రిక్‌ కొట్టారు. ఈసారి ఏడు అంశాలు ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. 2021లో టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77 సీట్లతో రెండో స్థానం సాధించింది. అయితే ఈ ఎన్నిల్లో మమతా బెనర్జీకి ఏడు సవాళ్లు ఎదురవుతున్నాయి.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

ఈసీ భద్రతా చర్యలు
ఎన్నికల సంఘం 1.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించి గుండా రిగ్గింగ్‌ను అరికట్టుతోంది. గతంలో టీఎంసీకి అనుకూలంగా ఉన్న సీఎస్, డీజీపీ, పోలీస్‌ అధికారులను బదిలీ చేసి అధికారాలను పరిమితం చేసింది. ఇది టీఎసీకి పెద్ద దెబ్బగా మారుతోంది.

పోలింగ్‌ వ్యవస్థలో విప్లవం
గేటెడ్‌ కమ్యూనిటీల్లో బూత్‌లు ఏర్పాటు చేయడంతో ఓటర్లు బెదిరింపు భయం లేకుండా ఓటు వేయగలరు, గుండా ప్రభావం తగ్గుతుంది. ప్రతి బూత్‌లో లైవ్‌ టెలికాస్ట్‌తో దొంగ ఓట్లు, గొడవలను రीयల్‌ టైమ్‌లో పర్యవేక్షించి రీపోలింగ్‌కు అవకాశం ఏర్పడుతోంది. ఓటింగ్‌ శాతం 80% పైకి ఎక్కే అవకాశం ఉంది.

ఓటర్ల జాబితా సవరణ..
స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ( సర్‌)తో 68 లక్షల పేర్లు తొలగించారు – బంగ్లాదేశ్‌ వలసులు, డూప్లికెట్లు, మర్మల్‌ ఓటర్లు, స్థానికంగా లేని వారిని గుర్తించి రద్దు చేశారు. 2021లో టీఎంసీకి 2.80 కోట్ల ఓట్లు, బీజేపీకి 2.29 కోట్లు (తేడా 60 లక్షలు), ఈ మార్పు టీఎంసీ లీడ్‌ను 5 నుంచి 10 శాతం తగ్గించవచ్చు. ముస్లిం ప్రాంతాల్లో తొలగింపులు ఎక్కువగా టీఎంసీని దెబ్బతీసే అవకాశం ఉంది.

మైనారిటీ ఓట్ల చీలిక..
ముస్లిం ఓటర్లు 100+ సీట్లలో కీలకం, 2021లో 90 సీట్లు టీఎంసీకి వచ్చాయి. కొత్తగా ఎంఐఎం, ఏజేయూపీ, మరో ముస్లి పార్టీ జట్టు కట్టాయి. దీంతో మమతవైపు ఉన్న ముస్లిం ఓటర్లు చీలిపోయే అవకాశం ఉంది. సర్‌ తొలగింపులు మరింత ప్రభావితం చేస్తాయి. టీఎంసీ 30 శాతానికిపైగా మైనారిటీ ఓట్లు కోల్పోతే 20–25 సీట్లు పోతాయి.

బీజేపీ వ్యూహాత్మకంగా..
బీజేపీ ’మిషన్‌ బెంగాల్‌’లో అర్బన్, మధ్యతరగతి బెంగాలీలు, ప్రెసిడెన్సీ ఏరియాపై ఫోకస్‌ పెట్టింది. సువేందు అధికారి అక్కడ పోటీతో మోదీ జనాదరణను ఉపయోగించాలని. టీఎంసీ 75 అభ్యర్థులను మార్చి టికెట్లు సర్దుబాటు చేసింది, వెల్ఫేర్‌ స్కీమ్‌లు (లక్ష్మీ బిమా)పై ఆధారపడుతోంది. బీజేపీ అంతర్గత కలహాలు, వర్గపోరాటాలు (19.9% సర్వే రెస్పాండెంట్లు) సవాలుగా ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

AP Heavy Rains

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...
TDP MLC Candidates

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...
ADR Report 2026

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...
West Indies vs Pakistan

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....
Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper