Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఏ రోజుకారోజు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అచ్చం సినిమా కథనంలా పలు విషయాల్లో అనేక కోణాల్లో కేసు పురోగతి ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు సీబీఐ సేకరించిన సాక్ష్యాలు వట్టివేనని మరో బాంబు పేల్చారు. దీంతో కేసు కలకలం రేపుతోంది. కేసు కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ మొదటికి వస్తోంది.

ఈ నేపథ్యంలో వివేకా కుమర్తె సునీతా రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో హత్య కేసు సీబీఐకి అప్పగిస్తే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతారనే విషయం చెప్పారని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కేసులో సునీత తనను ప్రలోభాలకు గురి చేసిందని గంగాధర్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. దీంతో కేసు ఇంకా ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు.
దీంతో కేసులో అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు చేర్చాలని తనపై ఒత్తిడి చేసినట్లు చెబుతున్నారు. పైగా తనకు రూ.20 వేలు ఇచ్చినట్లు వెల్లడించారు. పైగా తన కాలు శస్త్ర చికిత్స కు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పి తప్పులు సాక్ష్యాలు చెప్పించినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాడు దీంతో వివేకా కేసు ఇంకా ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

మొత్తానికి వివేకా హత్య కేసులో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలియడం లేదు. కేసులో ఆ ముగ్గురు పేర్లు సూచించాలని చెబుతూ తనను ఇబ్బందులకు గురి చేశారని గంగాధర్ రెడ్డి చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. భవిష్యత్ లో ఇంకా ఎందరు నిందితులుగా చేరతారో కూడా తెలియడం లేదు. కానీ వివేకా హత్య కేసు ఇప్పట్లో ముగియడం మాత్రం కుదరదని చెబుతున్నారు.
[…] Money Earn: 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే డబ్బు అనే వస్తువు మీద జీవితాంతం పని చేస్తాడు. అందుకే, డబ్బు చేతులనే కాదు మనుషులను కూడా మారుస్తోంది. ప్రపంచంలో డబ్బు సంపాదన కోసం ఎన్నో మార్గాలున్నాయి. మనిషికి డబ్బు రావాలన్నా మనిషి నుంచే రావాలి. మనిషి డబ్బు ఇవ్వాలన్నా మనిషికే ఇవ్వాలి. […]
[…] Jeevitha Sathyalu: నిజం చెప్పాలి అంటే జీవితం లో ఒక స్టేజి కి వచ్చే వరుకు.. జీవితాన్ని మనం మన కోణంలో చూడలేం. దీనికితోడు వయసును బట్టి కూడా.. మనం చూసే కోణం మారుతూ ఉంటుంది. అందుకే, యుక్త వయసులో కొత్త కోణంలో జీవితాన్ని చూడడానికి ప్రయత్నించి చాలామంది భంగ పడుతూ ఉంటారు. అయితే, జీవితం అనేది వైట్ బుక్ లాంటిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక్కో జీవితం ఒక్కో లెక్క లాంటిది. ఆ జీవితంలో ఎవడి ఫార్ములా వాడే కనిపెట్టుకోవాలి. […]
[…] Bigg Boss Non Stop Telugu: ఇప్పటివరకు టీవీలో ఒక గంటపాటు అలరించిన బిగ్ బాస్.. ఇక నుంచి 24 గంటల పాటు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. అయితే బిగ్ బాస్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో ఏదో ఒక గొడవలు జరగడం చాలా కామన్. బిగ్ బాస్ ఏదో ఒక మెలిక పెట్టి వారి మధ్యలో చిచ్చు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి టాస్క్ ఇస్తాడో, ఎలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తాడో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. మరి ఇప్పుడు 24 గంటల పాటు ఎలాంటి టాస్క్ లు విధిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. […]
[…] Bandi Sanjay Padayatra: బండి సంజయ్.. గతంలో ఉన్న బీజేపీ అధ్యక్షుల కంటే చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. గతంలో ఉన్న అధ్యక్షులు పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత నుంచి విడిచిపెట్టే వరకు తమ ప్రభావాన్ని పార్టీలో పెద్దగా చూపించలేకపోయారు. కానీ బండి సంజయ్ మాత్రం తన మార్కు రాజకీయాలతో పార్టీని తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తొలివిడత ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. […]
[…] YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పట్లో తేలడం లేదు. రోజుకో రకంగా తిరుగుతూ పరిష్కారం కాకుండా సాగుతూనే ఉంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారిస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో విధంగా కేసు మారుతోంది. దీంతో సీబీఐ సైతం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వివేకా హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై అనుమానాలు ఇంకా వీడటం లేదు. […]