Funeral: హిందూ మతంలో అనేక సంప్రదాయాలు సంస్కృతులు ఇమిడి ఉన్నాయి. అయితే వాటి మూలాలు ఏంటి, అసలు అలాంటి ఆచారాలను ఎందుకు పాటించాలి అనేది ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. కానీ మన పూర్వీకులు వాటి వెనుక చాలా పెద్ద రహస్యాలను దాచి ఉంచారు. వాటి గురించి తెలుసుకుంటే నిజంగా ఔరా అనిపించకమానదు. ఇలాంటి అనేక ఆచారాల్లో మన చుట్టూ ఇప్పటికీ కొన్ని జరుగుతూనే ఉన్నాయి.

ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శవయాత్రలో శివ మీద, మరమరాలు, డబ్బులు ఎందుకు చల్లుతారో చాలా మందికి తెలియదు. కాగా దీని వెనక చాలా పెద్ద విషయమే ఉందండోయ్. అది ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మన దగ్గర కూడా ఎవరైనా చనిపోతే శవయాత్రలో భాగంగా ఆ శవం మీద అ డబ్బులు చల్లుతారు.
అలాగే ముందు చాలా మంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డప్పులు, బాణాసంచా పేల్చుతూ నానా హంగామా చేస్తూ శవయాత్ర నిర్వహిస్తుంటారు. అయితే డబ్బులు చల్లడం వెనక ఓ పెద్ద నీతి కథ ఉంది. అదేంటంటే చనిపోయిన వ్యక్తి తాను ఎంత సంపాదించినా.. ఒక్క రూపాయి కూడా తన వెంట తీసుకుపోలేక పోతున్నాడు అనే విషయాన్ని తెలియ చెప్పడానికి ఇలా చేసేవారు.

కాబట్టి బ్రతికి ఉన్నన్ని రోజులు డబ్బుల కోసం అవినీతి, అక్రమాలు చేయకుండా ప్రశాంతంగా బతకాలని, నలుగురికి సాయం చేస్తూ పేరు తెచ్చుకోవాలని దీని ఉద్దేశం. అందుకే ఈ ఆచారాన్ని అనాదిగా హిందూ మతంలో ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. పూర్వీకులు జీవితం అర్థాన్ని తెలిపే విధంగా ఈ ఆచారాన్ని పెట్టారన్నమాట. కానీ ఇప్పటి తరం వారికి ఈ ఆచారాలు చాలా చిన్నచూపు అయిపోతున్నాయి.