Homeజాతీయ వార్తలుVanama Raghava: ఎట్టేకేలకు వనమా రాఘవను సాగనంపిన టీఆర్ఎస్

Vanama Raghava: ఎట్టేకేలకు వనమా రాఘవను సాగనంపిన టీఆర్ఎస్

Vanama Raghava: తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపిన వ‌న‌మా రాఘ‌వ‌రావు ఘ‌ట‌న ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న విష‌యంలో స్పందించ‌ని టీఆర్ ఎస్.. ఎట్ట‌కేల‌కు ఆయ‌న్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్ర‌తిప‌క్షాల నుంచి, ఇటు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న‌పై వేటు వేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా కేసీఆర్ ఆదేశాల ప్ర‌కార‌మే వేటు వేసిన‌ట్టు ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. ఇదే విష‌యం మీద ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు జిల్లా ఇన్‌చార్జ్ నరేష్ రెడ్డి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Vanama Raghava
Vanama Raghava

ఇక నిన్న ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు.. త‌న‌కొడుకు విష‌యంలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతార‌ని అందులో చెప్పారు. కానీ మీడియా ముందు మాట్లాడ‌క ముందే.. ఆయ‌న్ను కొత్త‌గూడెం పోలీసులు హైద‌రాబాద్ లో అరెస్టు చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆయ‌న్ను అరెస్టు చేయ‌లేద‌ని పాల్వంచ ఏసీపీ స్ప‌ష్టం చేశారు. దీంతో అస‌లు ఆయ‌న్ను అరెస్టు చేశారో లేదో తెలియ‌క గంద‌ర‌గోళం నెల‌కొంది.

Also Read: ఈటలకు అలా.. ‘వనమా’కు ఇలా..కేసీఆర్ ది ధృతరాష్ట్ర తీరేనా?

రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ఏ-1 గా ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్నారు రాఘ‌వ‌. త‌న భార్య‌ను త‌న వ‌ద్ద‌కు పంపాలంటూ రాఘ‌వ హుకూం జారీ చేశార‌ని ఆత్మ‌హ‌త్య‌కు ముందు సెల్ఫీ వీడియోలో రామ‌కృష్ణ ఆరోపించారు. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. గ‌తంలో కూడా అనేక కేసుల్లో ఆయ‌న తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు.

ఒక ఎస్సై ఆత్మ‌హ‌త్య కేసులో కూడా రాఘ‌వ‌రావు ఏ-1గా ఉన్నారు. 2006 నుంచి 2013, 2017 అలాగే వ‌రుస‌గా ఈ మూడేంట్లు కూడా ఆయ‌న మీద కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. ఒక గిరిజ‌న మ‌హిళ‌కు చెందిన భూమి విష‌యంలో ఆమె మీద దాడి చేయించార‌నే ఆరోప‌న‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపాయి. ఇలా వ‌రుస వివాదాల‌తో ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర్ రావుకు ఆయ‌న క‌లంకం తెస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ పెత్త‌నం మొత్తం ఆయ‌న చేతుల్లోనే పెట్టుకుంటార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఆయ‌న ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌నేది ఎవ‌రికీ తెలియ‌ట్లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న కోసం ఇంటికి నోటీసులు అతికించారు పోలీసులు. ఆయ‌న కోసం అంత‌టా గాలిస్తున్నారు.

Also Read: అతను మొదటి నుంచి అలానే.. అరాచకాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే కొడుకు..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper