YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి రావడం లేదు. కొద్ది రోజులుగా సీబీఐ దర్యాప్తు చేపట్టినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో కేసు పలు మలుపులు తిరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ చిక్కుల్లో పడుతోంది. చార్జీ షీటుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కోర్టు ముందుంచాలని చెప్పింది. వివేకా మాజీ కారు డ్రైవర్ షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు సీబీఐ సహకరించిందని తెలుస్తోంది. దీంతో మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, మరో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దస్తగిరి అప్రూవర్ గా అయ్యేందుకు అతడికి ఎలాంటి సహాయ సహకారాలు లేవని తెలుస్తోంది. వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు ఎలాంటి పరిస్థితులు లేవని కోర్టు భావించింది. సీఆర్ పీసీ సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలం నమోదు చేసింది. వాంగ్మూలం నమోదు చేశాక అప్రూవర్ గా అవకాశం ఉండదని చెబుతోంది. దీంతో వివేకా కేసులో పలు ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: మలుపులు తిరుగుతున్న వివేకా హత్య కేసు
ఈ కేసులో సీబీఐ తీరుపై అందరు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా దర్యాప్తు కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఏమేరకు స్పందించినా కేసు మాత్రం పరిష్కార దిశగా సాగడం లేదని తెలుస్తోంది దీనిపై సీబీఐ ఎన్ని మార్గాల్లో విచారణ చేసినా ఇంకా ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు.
కేసులో వాయిదాలు ఎక్కువగా వస్తున్నా పరిష్కార మార్గాలు ఇంకా కానరావడం లేదు. సీబీఐ దర్యాప్తు పై కూడా పలు కోణాల్లో అనుమానాలు వస్తున్నాయి. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఇంకా తాత్సారం చేస్తూ ఏం తేల్చడం లేదు. దీంతో కేసుతో సంబంధం లేని వారిని కూడా ఇందులో ఇరికించారనే విమర్శలు సైతం రావడం గమనార్హం. ఇంకా ఈ కేసు పూర్తయ్యే నాటికి ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాల్సిందే.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో ఇన్ని ట్విస్టులా? చివరకు కూతురుపైనే నెపమా?