Homeజాతీయ వార్తలుVijay Cabinet Minister Keerthana: టిడిపి సోషల్ మీడియాలో కీలకం.. ఇప్పుడేమో విజయ్ కేబినెట్లో...

Vijay Cabinet Minister Keerthana: టిడిపి సోషల్ మీడియాలో కీలకం.. ఇప్పుడేమో విజయ్ కేబినెట్లో మంత్రి.. ఈ తెలుగు మహిళ గురించి తెలుసా..

Vijay Cabinet Minister Keerthana: ఒకప్పుడు టిడిపి సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పని చేసింది. టిడిపికి సోషల్ మీడియాలో తిరుగులేని స్థాయిని అందించింది. ఆ తర్వాత ఆమె జీవితం మరోవైపు టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మహిళ పేరు కీర్తన. ఆమెది సామాన్య కుటుంబం. రాజకీయం మూలాలు లేవు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ […]

Vijay Cabinet Minister Keerthana: ఒకప్పుడు టిడిపి సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పని చేసింది. టిడిపికి సోషల్ మీడియాలో తిరుగులేని స్థాయిని అందించింది. ఆ తర్వాత ఆమె జీవితం మరోవైపు టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.

విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మహిళ పేరు కీర్తన. ఆమెది సామాన్య కుటుంబం. రాజకీయం మూలాలు లేవు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు..

కీర్తనది తెలుగు మూలాలు ఉన్న కుటుంబం. ఈమె విరుద్ నగర్ జిల్లాలోని చిత్ర రెడ్డియ పట్టి ప్రాంతానికి చెందినవారు. ఈమె డిగ్రీ వరకు ఇక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకున్నారు. ప్రశాంత్ కిషోర్ బృందంలో కొంతకాలం పని చేశారు. గోవా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం కూడా ఆమె పని చేశారు. హైదరాబాదులో టిడిపి సోషల్ మీడియా లో కీలక పర్యవేక్షకురాలుగా పనిచేశారు. అప్పుడే ఆమె తెలుగు మీద విపరీతమైన పట్టును సాధించారు.

సోషల్ మీడియాలో శివకాశి నియోజకవర్గంలో సమస్యల మీద ఒక వీడియో రూపొందించిన ఆమె.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఆమె పొలిటికల్ లైఫ్ ను మార్చేసింది.. ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ బృందం ఆమెను సంప్రదించింది.. ఆమెకు టికెట్ కూడా కేటాయించింది. కీర్తన వినూత్న శైలిలో ప్రచార చేసే ఆకట్టుకుంది. ప్రచార సమయంలో తెలుగులో మాట్లాడి చాలామంది ఓటర్లను ఆకర్షించారు. శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ మీద 11 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో గెలిచిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. విజయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్ర తన పేరు మీద రాసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper