Kolkata RG kar hospital : కోల్ కతా లోని ట్రెయినీ డాక్టర్ హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది క్రమేపి రాజకీయ రంగు పులుముకొంది. ఈ క్రమంలోనే ఆ వైద్యురాలి పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క వ్యక్తి మాత్రమే ఆమెపై లైంగికంగా దాడి చేస్తే అంతస్థాయిలో.. ఆ ద్రవం ఆమె శరీరంలో ఉండే అవకాశం లేదని పోస్ట్ మార్టం చేసిన వైద్యులలో ఒకరైన డాక్టర్ సుభర్ణ గో స్వామి పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో చాలామంది ప్రమేయం ఉందని సమాచారం. ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. ఆమె శరీరంపై కూడా తీవ్రస్థాయిలో గాయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి మాత్రమే ఆమెపై ఆ ఘాతుకానికి పాల్పడితే.. ఆ స్థాయిలో గాయాలు చేయలేడు.
ఆగస్టు 9న..
ఆగస్టు 9న కోల్ కతా లోని వైద్య కళాశాలలో సెమినార్ గదిలో ఆ ట్రెయినీ వైద్యురాలు నగ్నంగా పడి ఉంది.. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ట్రెయినీ విద్యార్థిగా ఉంది. ఈ ఘటనలో సీసీ కెమెరాలు ప్రత్యేకంగా పరిశీలించిన పోలీసులు.. సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.. అయితే ఈ ఘటన ను పశ్చిమ బెంగాల్ లోని బిజెపి నాయకులు వదిలి పెట్టడం లేదు. అధికార మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఫలితంగా ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో ఈ కేసును విచారించే బాధ్యతను సిబిఐ స్వీకరించింది.
ట్రెయినీ వైద్యురాలి హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నాయి. దేశంలోని అన్ని ఆసుపత్రుల వైద్యులు ఆందోళలు, నిరసనలు చేపడుతున్నారు. దీంతో ఈ కేసు ను సిబిఐ కి హ్యాండ్ ఓవర్ చేయాలని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం కోల్ కతా లోని ఆర్ జీ ఆసుపత్రిని సిబిఐ అధికారులు సందర్శించారు. సి సి ఫుటేజీలు పరిశీలించారు. ఆస్పత్రి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. అయితే పోస్టుమార్టం నివేదికను, సిసి ఫుటేజ్ లను బహిర్గతం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ నివేదికలో ఏముందంటే
పోస్టుమార్టం నివేదికలో ఆ వైద్యురాలి ని గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. థైరాయిడ్ భాగంలోని మృదులాస్థితి పూర్తిగా విరిగిపోయింది. ఆమె ప్రవేట్ భాగాలలో తీవ్రమైన గాయాలయ్యాయి. పెదవులు, వెళ్ళు, ఎడమ కాలి పై కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. లైంగిక దాడి చేస్తున్న సమయంలో ఆమెకు ఊపిరాడకుండా నోట్లో గుడ్డలు కుక్కరు. ఆమె తలను గోడకు కొట్టారు. ముఖంపై కూడా గీతలు ఉన్నాయి. లైంగిక దాడి చేసే సమయంలో నిందితులు తమ పశు ప్రవృత్తిని ఆమెపై ప్రదర్శించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More