spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vishal- Chandrababu: చంద్రబాబుపై కుప్పంలో పోటీపై స్టార్ హీరో సంచలన నిర్ణయం

Vishal- Chandrababu: చంద్రబాబుపై కుప్పంలో పోటీపై స్టార్ హీరో సంచలన నిర్ణయం

Vishal- Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజవర్గం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉంటోంది. వైసీపీ, టీడీపీ కుప్పంపై ప్రధాన దృష్టి సారించాయి. 2024 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించాలని పాచికలు వేస్తున్నాయి. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ తీసిన వైసీపీ అదే ఊపుతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో టీడీపీని కుప్పంలో కనుమరుగు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబును ఎదుర్కొనే వారి కోసం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ తమిళ హీరో విశాల్ ను ఇక్కడి నుంచి పోటీకి దింపుతారనే వార్తలు వస్తున్న సందర్భంలో విశాల్ వాటికి తెర దించాడు. వచ్చే ఎన్నికల్లో తాను కుప్పం నుంచి పోటీకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రచారంగానే కొట్టిపారేశారు.

Vishal- Chandrababu
Vishal- Chandrababu

గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి సీట్లు రాకుండా చేయడంలో వైసీపీ పైచేయి సాధించింది. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తమ పార్టీని ఓడించేందుకు వైసీపీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. రాజకీయాల్లో ఇంతటి దుర్మార్గం ఉండదని అప్పట్లో నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కూడా టీడీపీని ఓడించేందుకే వైసీపీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కుప్పం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కుప్పంలో విజయం సాధించాలని రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

కుప్పంతో తన అనుబంధం గురించి విశాల్ వివరించారు. తన తండ్రి గ్రానైట్ కంపెనీలో పనిచేసేటప్పుడు మూడేళ్లు కుప్పంలో ఉన్నానని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమే కాని ఇప్పుడు కాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తానని వెల్లడించారు. దానికి ఇంకా సమయం ఉందని తేల్చారు. తాను కుప్పం నుంచి పోటీ చేస్తానని వస్తున్న వార్తలను ఖండించారు. వైసీపీ అభ్యర్థిగా భరత్ ఉంటారని ఇదివరకే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వమే ఫైనల్ అని చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ చేస్తారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నా అందులో వాస్తవం లేదని తేలడంతో విశాల్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశాల్ ఎందుకు పోటీకి నిరాకరించాడనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు విశాల్ ను పోటీకి ఒప్పించారనే వార్తలు జోరుగా వచ్చినా అవి వట్టివేనని తేలిపోవడం గమనార్హం.

Vishal- Chandrababu
Vishal- Chandrababu

కుప్పం రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే కలిగిస్తోంది. పోయిన పరువు నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా ఇక్కడ గెలవాలని చంద్రబాబు, బాబు ఇలాకాలో తమ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కుప్పంలో ద్విముఖ పోరు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోననే అనుమానాలు అందరిలో నెలకొనడం సహజమే. సినీ హీరో విశాల్ కూడా తాను పోటీలో లేనట్లు ప్రకటించడంతో ఇరు పార్టీలు తమ ప్రభావం చూపించి గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

కుప్పంపై రెండు పార్టీలు గట్టిగానే స్పందిస్తున్నాయి. గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నాయి. అధికార పార్టీ పథకాలతో ప్రతిపక్ష పార్టీ హామీలతో ప్రజలను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించడం మామూలే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తేనే పరువు దక్కుతుందని టీడీపీ, స్థానిక సంస్థల ఫలితాలు పునరావృతం చేయాలని అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper