Telangana MP: రాజకీయ నాయకులకు ఏ వీక్ నెస్ లు ఉన్నా పర్వాలేదు. కానీ స్త్రీ వీక్ నెస్ ఉండకూడదు. ఆడవాళ్ళ వల్ల గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కూలిపోయాయనే చారిత్రక సత్యాన్ని మరవకూడదు. కానీ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. ఫలితంగా ఆయనకు ఓ మహిళ నాలుగేళ్ళుగా చుక్కలు చూపిస్తోంది. పైగా 2019లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీడియాకు లిక్ చేస్తానని బెదిరించింది. ఆ సమయంలో సదరు ఎంపీ నోరు జారడంతో ఆ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కుదరడంతో వివాదం సమసి పోయింది. కానీ కొద్ది రోజులకే మళ్లీ నిప్పు రగిలింది. ఇప్పుడు ఇదే ఆయనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది.

ఇంతకీ ఏం జరిగింది
..
ఆయన మొదట్లో చిన్న వ్యాపారిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అనుకోని పరిస్థితులలో ఓ రాజకీయ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పట్టిందల్లా బంగారమైంది. వ్యాపారం అంతకంతకు పెరిగింది. చిన్న వ్యాపారిగా మొదలైన ఆయన ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇదే సమయంలో ఓ భూ వివాదానికి సంబంధించి ఓ మహిళ ఆయనను సంప్రదించింది. ఈ విషయంలో ఆయన కొంచెం చొరవ తీసుకున్నారు. ఫలితంగా వివాదం పరిష్కారమైంది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వారంలో నాలుగు రోజులు ఆమె వద్దే ఆయన ఉండే స్థాయికి ఎదిగింది. ఫోన్లో కూడా దొరకని ఆయన ఏకంగా ఈమె కోసం ఏదైనా చేసే స్థాయికి దిగజారారు. నియోజకవర్గానికి దూరమయ్యారు. ఫలితంగా 2018 లో ఎమ్మెల్యేగా పోటీ చేసి దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ఇంట్లో కూడా ఒత్తిళ్ళు అధికం కావడం, వ్యాపార పరంగా భారీగా నష్టాలు రావడంతో అంతర్మథనంలో కూరుకు పోయారు. ఈ విషయం తెలిసిన ఆయన సదరు మహిళను బెదిరించారు. దీంతో ఆమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది.
..
ఇక్కడే అసలు కథ మొదలైంది

..
వేరే ప్రాంతానికి వెళ్లిన ఆమెను సదరు ప్రజా ప్రతినిధి ప్రత్యర్థులు కలిశారు. విషయంపై ఆరా తీశారు. ఆమె పూస గుచ్చినట్టు చెప్పడంతో తమ ప్లాన్ కు తెరదీశారు. ఇదే సందర్భంలో ఆమెతో ఆయనకు ఫోన్ చేయించారు. నా దగ్గరకు ఎందుకు రావడం లేదని ఆమె అడిగితే, అసలే ఓటమి బాధలో ఉన్న ఆయన ఆగ్రహంగా మాట్లాడాడు. దీన్ని తెలివిగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అప్పటినుంచి ఆమె, అతని మధ్య వైరం పెరిగింది. ఒకానొక దశలో ఆమె పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పటికీ.. ఆయనకు ₹వేలకోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. హైదరాబాదులోని కూకట్పల్లిలో ఎకరాల కొద్దీ స్థలాలు ఉన్నాయి. అయితే వీటిపై కన్నువేసిన అధికార పార్టీ కి చెందిన ఓ కీలక ప్రతినిధి ఆయనకు ఎంపీ సీట్ ఆఫర్ ఇచ్చారు. అసలే వ్యాపారాల్లో నష్టాలు, ఎమ్మెల్యేగా ఓడిపోవడం, ఆ మహిళ చేతిలో మానసిక వేధింపులతో విసిగి వేసారిన అతను దీనికి ఒప్పుకున్నాడు. అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధికి కూకట్పల్లిలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత అధికార పార్టీ నుంచి ఎంపీ టికెట్ రావడం, ఆయన గెలవడం చకా చకా జరిగిపోయాయి. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడే సదరు మహిళ ఆ ప్రజా ప్రతినిధిని కలిసింది. తనను దూరం పెడితే మనం ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను మీడియాకు లీక్ చేస్తానని బెదిరించింది. దెబ్బకు బెదిరిపోయిన అతను ఎంపీగా గెలిచిన తర్వాత నీకు ప్రాధాన్యం ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన స్థాయి అంతకంతకు పెరిగిపోవడంతో ఈమెకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె.. అతడిని ఫోన్ లో నిలదీసింది. ఇవేవీ పట్టించుకోని అతడు ఆమెను మరింత దూరం పెట్టాడు. ఒకప్పుడు వారంలో నాలుగు రోజులు తన వద్దే ఉండే వ్యక్తి ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేక ఆమె తన ప్లాన్ ను అమల్లో పెట్టింది. ఆయన ప్రత్యర్థులను కలిసి తమ ఇద్దరం సన్నిహితంగా ఉన్న ఫోటోలను వాళ్లకు ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఈ ఫోటోలను చూపించి ఆయనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం. ఇది బయట పెడితే ఎక్కడ పరువు పోతుందనే భయంతో ఆయన లోలోపలే మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఆయన పార్టీ పెద్దకు తెలిసింది. దీంతో సదరు ప్రజా ప్రతినిధిని తన వద్దకు పిలిపించుకొని మూడు గంటలపాటు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సదరు మహిళతో ఎంత త్వరగా సెట్ చేసుకుంటే అంత మంచిదని హితవు పలికినట్టు సమాచారం. అయితే ఈ ప్రజాప్రతినిధి సదరు మహిళ కాళ్ళవేళ్ళపడ్డా కనికరించడం లేదని బోగట్టా! అందుకే నాయకుడి అనే వాడికి ఎలాంటి వ్యసనాలు ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీ వ్యామోహం అసలు ఉండకూడదు. ప్రస్తుతం ఆ ప్రజా ప్రతినిధి పరిస్థితి చూసి ఆయన ప్రత్యర్ధులు ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాడని వ్యంగంగా అంటున్నారు.