spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Politics : అచ్చెనాయుడే హోం మినిస్టర్.. తేల్చేసిన లోకేష్

TDP Politics : అచ్చెనాయుడే హోం మినిస్టర్.. తేల్చేసిన లోకేష్

TDP Politics : ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది టిడిపి నేత లోకేష్ వ్యవహార శైలి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నారు. ఇందులో రెండోది ఖాయం అనుకున్నా.. ఆయన చెప్పిన మొదటి మాట మాత్రం అంత ఈజీ కాదు. జనసేనకు టిడిపి పొత్తు పెట్టుకుంది. బిజెపితో పొత్తుకు ప్రయత్నిస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలను ఆ రెండు పార్టీలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టిడిపి 115 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో టిడిపి మ్యాజిక్ ఫిగర్ కు దాటగలదా? అన్నది అనుమానమే. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా లోకేష్ ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తున్నారు.

ప్రస్తుతం లోకేష్ శ్రీకాకుళంలో శంఖారావసభలను పూర్తి చేశారు. అయితే శ్రీకాకుళంలో అచ్చెనాయుడు రాష్ట్ర మంత్రి అవుతారని, రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారని లోకేష్ తేల్చి చెప్పారు. అంతటితో ఆగని ఆయన అచ్చెనాయుడు హోం మంత్రి అవుతారని కూడా తేల్చేశారు. ఉత్తరాంధ్రలో శాంతిభద్రతల పరిరక్షణలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. దానిని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సాధ్యమని లోకేష్ చెప్పుకొచ్చారు. అటు ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని.. టిడిపి అందులో చేరబోతుందని.. రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలిస్తే కేంద్రమంత్రి పదవి ఖాయమని లోకేష్ హింట్ ఇచ్చారు. అయితే శ్రీకాకుళంలో కింజరాపు కుటుంబానికి లోకేష్ పెద్దపీట వేయడాన్ని పార్టీలో వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోతోంది.

మరోవైపు తెలుగుదేశం పార్టీలో హోం మంత్రి పదవికి చాలా పోటీ ఉంది. గతంలో టిడిపి అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి నని చింతకాయల అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. నాలాంటి వాడికి ఇస్తే వైసిపి నేతలకు బుద్ధి చెబుతానని.. శాంతి భద్రతలను దారిలోకి తెస్తానని గతంలో అయ్యన్నపాత్రుడు ఒకసారి ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలో లోకేష్ ఎలా స్పందిస్తారు అన్నది చర్చగా మారింది. శంఖారావ సభల్లో భాగంగా నర్సీపట్నంలో సైతం లోకేష్ కార్యక్రమం ఉండనుంది. అక్కడ కూడా ఇదే తరహాలో అయ్యన్న హోం మంత్రి అవుతారని లోకేష్ ప్రకటిస్తారా? అని సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ ఈ తరహా ప్రకటనలు పార్టీకి చేటు తెస్తాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper