Bihar Protests: మనదేశంలో ఇప్పటివరకు ఎన్నో మోసాలు.. దారుణాలు.. ఘోరాలు జరిగాయి. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం ముందు వారిని దోషులుగా నిలబెట్టారు. కానీ మనదేశంలో.. ముఖ్యంగా పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఒక ఆరు సంవత్సరాల బాలుడిని అరెస్ట్ చేశారు. ఇలా ఎందుకు చేశారు.. దేనికి చేశారు.. ఈ సంఘటన వెనక జరిగిన అసలు వాస్తవం ఇది.
బీహార్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని.. ఆ పరీక్షలను రద్దు చేయాలని అక్కడ యువత రోడ్లమీదకి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి యువతను కట్టడి చేయడానికి పోలీసులు బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు. పైగా అనేకమంది విద్యార్థుల మీద కేసులు నమోదు చేశారు. కొంతమంది విద్యార్థులను అదుపులో కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం.. ఇతర ప్రజాప్రతినిధుల కార్యాలయాల ఎదుట పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. జన్ జెడ్ రోడ్లమీదకి వచ్చి నిరసన చేపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ బుధవారం తీవ్రస్థాయిలో ఆందోళన జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల్లో అవకతవకలను గుర్తించి..నిందితులపై చర్యలు తీసుకోవాలని అక్కడ యువత డిమాండ్ చేస్తోంది. దీనికి తోడు అక్కడి యువత మోడీ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇందులో ఒక ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడు మోడీ రిజైన్ చేయాలని ఫ్ల కార్డు పట్టుకొని ఉన్నాడు. దీంతో అక్కడి పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఆ బాలుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. “అవసరమైతే నేను అన్నింటికీ కూడా ఎదురు నిలబడతాను. ఎందుకంటే నేటి కాలంలో పేపర్ లీకులు సర్వ సాధారణంగా మారిపోయాయి. నా తరం వచ్చేసరికి ఇటువంటి లీకులు ఉండకూడదు. అందువల్లే నేను ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నాను. అవసరమైతే నేను జైలుకి కూడా వెళ్తాను. పేపర్ లీకులు చేస్తున్న వ్యక్తులను శిక్షించాలి. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని జైలుకు పంపించాలని” ఆ బాలుడు వ్యాఖ్యానించడం విశేషం.
బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీహార్లో నిరసనల్లో ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కోరుతూ పోస్టర్ పట్టుకున్న ఆరేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న వైనం
70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల నిరసనలు… pic.twitter.com/jiWbdkO1do
— RTV (@RTVnewsnetwork) August 26, 2026