BJP MLA Ram: ఫైర్ ఇంజన్ ను దేనికోసం ఉపయోగిస్తారు.. ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగితే.. మాటలు ఆ వాడుతారు. ఫైర్ ఇంజన్ ను అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఒక బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఫైర్ ఇంజన్ ను మరో దానికోసం ఉపయోగించాడు. అది కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని బిలాంజి ప్రాంతంలో బిజెపి ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కు ఇల్లు ఉంది. దీనిని ఆయన అధికారిక నివాసంగా ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఆయన తన నివాసం ముందు తన ప్రైవేట్ ఇన్నోవా కారును పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కారును మునిసిపల్ కార్పొరేషన్ కి చెందిన ఒక ఫైర్ బ్రిగేడ్ వాహనం లో ఉన్న నీటితో శుభ్రం చేశారు. ముగ్గురు సిబ్బంది రామ్ నివాస్ కారును కడిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అత్యవసరమైన సేవలకు ఉపయోగించాల్సిన ఫైర్ ఇంజన్ ను ఒక ప్రజా ప్రతినిధి సొంత పనుల కోసం ఉపయోగించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఫైర్ బ్రిగేడ్ వాహనాన్ని అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే కారును శుభ్రం చేయడానికి ఈ వాహనాన్ని ఉపయోగించడం విమర్శలకు కారణమవుతోంది. ఒకవేళ ఎమ్మెల్యే తన కారును శుభ్రం చేయాలి అంటే సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్లాలి. లక్షల రూపాయలు ఖర్చు చేసి వాహనాన్ని కొనుగోలు చేసిన ఎమ్మెల్యేకు.. సర్వీసింగ్ చేసే సామర్థ్యం లేదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షాలు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విలువైన ప్రకృతి వనరులను ఇలా సొంత పనుల కోసం ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఎమ్మెల్యే కూడా అందుబాటులోకి రాలేదు. ” సెగ్మెంట్ కు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అన్ని రైట్స్ ఉంటాయా.. అసలు ఇలా ఎలా వ్యవహరిస్తారు.. ఆయనకు ఓన్ వెహికిల్ ఉంటే.. ఓన్ గా సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ చేయించుకుంటే మహా అయితే 500 కంటే ఎక్కువ కాదు.. ఒక ఎమ్మెల్యే 500 కూడా ఖర్చు పెట్టే స్థాయిలో లేరా.. అసలు ఇదేం తీరు.. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడం పద్ధతి కాదని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే కారుకు ఫైర్ బ్రిగేడ్‌తో వాష్..!
వైరల్ వీడియోతో మధ్యప్రదేశ్‌లో రచ్చ!!!
మధ్యప్రదేశ్ సింగ్రౌలీలో ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ప్రభుత్వ క్వార్టర్స్ బయట బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును..
ఫైర్ బ్రిగేడ్ వాహనం తెచ్చిమరీ నీళ్లతో కడుగుతున్నట్లు వీడియోలో… pic.twitter.com/JdDP8sTBhY
— Ravi Prakash Official (@raviprakash_rtv) August 26, 2026