spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Sharmila: అన్న ప్రభుత్వతీరుపై నోరు మెదపని షర్మిల

Sharmila: అన్న ప్రభుత్వతీరుపై నోరు మెదపని షర్మిల

Sharmila: షర్మిల తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ దీక్షలు చేస్తున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. జిల్లాల పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టివచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సొంతంగా తెలంగాణ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత అన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తాను బీ-టీం కాదని ఎన్నో సందర్భాల్లోనూ చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇటీవల ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును జగన్‌, అతని అనుచరగణం వ్యక్తిగత దూషణలకు దిగినా షర్మిల స్పందించడం లేదు. చంద్రబాబు భార్యను అవమానకరంగా మాట్లాడితే ఓ మహిళ అయి ఉండి కూడా ఎందుకు స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Sharmila
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికి ఆయన సతీమణిని దారుణంగా అవమానించిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతి స్పందనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచి కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాంధీ సహా అనేక మంది వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు. మహిళల్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాజాగా కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ కొండా సురేఖ కూడా స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరి కావన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడానికి ఓ కారణం ఉంది. కొద్ది రోజుల కిందట టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్న ఓ ఉత్తరాది ఊతపదాన్ని పట్టుకుని.. సీఎం జగన్‌ తననే అన్నారని తెలుగులో కొత్త అర్థం చెప్పుకున్నారు. అలా చెప్పుకుని చేసిన దాడులను కేటీఆర్‌ సమర్థించారు. ఓ ముఖ్యమంత్రిని అలా తిట్టడం ఏమిటన్నారు. దానికి సాక్షి మీడియా భారీగా ప్రచారం కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానంపై.. మహిళల్ని కించ పరిచిన వైనంపై ఎందుకు స్పందించరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్నలో రీజన్‌ ఉంది. అలాగే వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎందుకు స్పందించని కొండా సురేఖ ప్రశ్నించారు. స్వయంగా తన అన్న నేత త్వం వహిస్తున్న పార్టీ.. తాను ఓటు వేయాలని ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు ఓ మహిళను ఘోరంగా అవమానిస్తే ఎందుకు మాట్లాడరని శర్మిలను ప్రశ్నించారు. ఆమె స్పందించాలని సురేఖ డిమాండ్‌ చేస్తున్నారు. ఆమె స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Also Read: Visakha Capital Issue: విశాఖ రాజధాని ఫైట్: జగన్ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో ఉద్యమం షురూ..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Oktelugu Epaper