Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగింది. నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుంది అనే విషయానికి వస్తే.. దీప గుడి నుంచి పిల్లలను ఇంటికి పంపి తన తండ్రి దగ్గరికి వెళుతుంది. దీప ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కార్తీక్ తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో కార్తీక్ భయపడతాడు. ఇక దీప తన తండ్రి దగ్గరకు వెళ్లి పండుగకు బట్టలు తీసుకొని వెళ్లడంతో తన తండ్రి దీప ఒకటే రావడాన్ని చూసి కంగారు పడతాడు. అసలు ఏం జరిగింది అంటూ ఆలోచిస్తాడు.
ఇక మోనిత తన కొడుకు బారసాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఉదయానికి అంత ఇల్లు మొత్తం డెకరేషన్ పూర్తి కావాలని పని వారిని గట్టిగా హెచ్చరిస్తుంది. అంతలో ప్రియమణి రావడంతో ప్రియమణికి కూడా పనులు అప్పచెబుతుంది. ఆ సమయంలోనే డాక్టర్ భారతి రావడంతో మోనిత హడావుడి సంతోషాన్ని చూసి భారతి టెన్షన్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటూ ఆలోచనలో ఉంటుంది. ఈ క్రమంలోనే సౌందర్య కుటుంబం బారసాల కు ఎలా వస్తారని అనుకుంటున్నావు అని భారతి అనడంతో మోనిత వస్తారు తప్పకుండా వస్తారు అంటూ బదులిస్తుంది.
మరుసటి రోజు ఉదయం కార్తీక్ సౌందర్య ఆనందరావు బారసాల కార్యక్రమానికి బయలుదేరుతారు.ఇప్పుడు మనం వెళ్లడం అవసరమా అంటూ ఆనందరావు అనడంతో తప్పదు వెళ్లాల్సిందే అంటూ సౌందర్య దీప గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక బారసాల కార్యక్రమానికి అందరూ రావడంతో మోనిత వారందరినీ ఎంతో సంతోషంగా పలకరిస్తూ కార్తీక్ కోసం ఎదురుచూస్తుంది. అంతలో భారతి రావడం ప్రియమణి దగ్గర మోనిత ధైర్యం గురించి మాట్లాడుతుంది. ఇలా వీరు ముగ్గురు మాట్లాడుతుండగా వారణాసి ఆటోలో నుంచి దీప చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని దిగుతుంది. అది చూసిన ప్రియమణి, భారతి, మోనిత షాక్ అవుతారు.
Also Read: Bangarraju Movie: వచ్చేస్తున్న నవ మన్మధుడు… బంగార్రాజు మూవీ నుంచి చైతూ కి బర్త్ డే గిఫ్ట్
దీప ఇంట్లోకి వచ్చి వారితో నవ్వుతూ మాట్లాడుతూ తను తెచ్చిన బ్యాగ్ ప్రియమణికి ఇచ్చి లోపల పెట్టమని చెబుతుంది. ఇక కార్తీక్ బాధతో అక్కడి నుంచి మోనిత ఇంటికి బయలుదేరుతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తిగా కాగా వచ్చే ఎపిసోడ్ లో దీప మోనిత కొడుకు బారసాలలో వంటలక్కగా మారి వంటలు చేస్తూ ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాక్ ఇస్తుంది. అదేవిధంగా
మోనితకు వచ్చిన గర్భం గురించి అందరికీ షాకింగ్ న్యూస్ చెబుతుంది. మరి అది ఏంటి అనే విషయం తర్వాత ఎపిసోడ్ లో తెలియాల్సి ఉంది.
Also Read: Anil Ravipudi: దర్శకుడిగా ఇది నాకు ఆరో పుట్టినరోజు- అనిల్ రావిపుడి