సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. దేశంలో లాక్ డౌన్ అనంతరం రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్‌బీఐ సమీక్ష సమావేశం ముంబైలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం వివరాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఖరీఫ్ లో 36 % ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. భారత్ జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసిందన్నారు. జీ-20 దేశాల్లో భారత్ జీడీపీ నే అధికమన్నారు. జీడీపీ లో 3.2 శాతం ద్రవ్యం అందుబాటు లోకి తెచ్చినట్లు తెలిపారు. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని, 2021-22 వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధి రేట్లు తిరోగమనంలో ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎం లు పని చేస్తున్నాయన్నారు. బ్యాంకులు, ఎటీఎం లలో ఎప్పటి కప్పుడు నగదు నింపుతున్నాయని, బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉందన్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Rs 1 20 lakh crore released after lockdown
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com