Richest Chief Minister In India: ప్రజాసేవ అనేది బూటకం. ఆస్తులు సంపాదించుకోవడమే దాని వెనుక ఉన్న అసలైన పరమార్ధం. మనదేశంలో శాసన వ్యవస్థ కంటే రాజకీయ వ్యవస్థ అత్యంత బలమైనది. అందువల్లే రాజకీయ నాయకులు వ్యవస్థలను మొత్తం శాసిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అధికారుల సైతం రాజకీయ నాయకులు కింద పనిచేయాల్సి ఉంటుంది. మరి చెప్పినదల్లా వినాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి అధికారం గనక దక్కితే.. వారు చెప్పినట్టు అధికారులు తల ఊపాల్సి ఉంటుంది.
అడ్డగోలుగా సంపాదించడం మాత్రమే కాదు.. ఇతర మార్గాల్లో ఆర్జించి.. దానిని ఎన్నికల్లో ఖర్చుపెట్టి.. దర్జాగా పదవులను పొందుతున్నారు కొంతమంది నాయకులు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన పెట్టుబడి కంటే కొన్ని కోట్ల రేట్లు సంపాదించి వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్స్ గా చలామణి అవుతున్నారు. ఒకప్పుడు అంటే ఈ విషయాలు అంతగా వెలుగులోకి వచ్చేవి కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా వెంటనే తెలిసిపోతుంది. ఇక మనదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో అత్యధిక డబ్బు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈయన రూపంలో లభించింది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు ఒకసారి కొత్త రికార్డు కూడా సృష్టించారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా నిలిచారు. డీకే దగ్గర దాదాపు 1,413 కోట్ల అసెట్స్ ఉన్నాయి. ఈ ఆ తర్వాత 931 కోట్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ స్థానంలో ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 648 కోట్లతో మూఢస్థానంలో ఉన్నారు. అయితే దేశంలోనే అత్యధిక ధనవంతులైన ముఖ్య మంత్రులుగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు కావడం విశేషం.
డీకే కంటే ముందు చంద్రబాబు దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఉండేవారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు రెండవ స్థానానికి పరిమితమయ్యారు.
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుపొందారు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అప్పటినుంచి ఆయన సోనియాగానికి నమ్మిన బంటుగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ఆయన నిత్యం అందుబాటులో ఉంటారు. అందువల్లే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని కర్ణాటక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
