Homeజాతీయ వార్తలుRaghunath temple reopened: ఊచకోత తర్వాత కశ్మీర్ లో 36 ఏళ్లకు తెరుచుకున్న రఘునాత గుడి...

Raghunath temple reopened: ఊచకోత తర్వాత కశ్మీర్ లో 36 ఏళ్లకు తెరుచుకున్న రఘునాత గుడి తలుపులు..

Raghunath temple reopened: దేశ విభజన తర్వాత జమ్మూ కశ్మీర్‌కు కల్పించిన ఆర్టిక్‌ 370 రక్షణతో ముస్లింలు రెచ్చిపోయారు. స్థానిక ముస్లింల అండతో అక్కడి హిందువులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. దీంతో చాలా మంది హిందువులు వలస వెళ్లారు. కశ్మీరీ పండితులు ఢిల్లీకి వెళ్లిపోయారు. దీంతో అనేక ఆలయాలు మూతపడ్డాయి. ఐదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టింది. దీంతో పర్యటకరంగం పుంజుకుంటోంది. రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన హిందువులు తిరిగి వస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలో మూతపడిన ఆలయాలు తెరుచుకుంటున్నాయి. శ్రీనగర్‌ లోయలో మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ గంటానాదాలు మోగాయి. 1990లో ఉగ్రవాద ఉగ్రరూపం దాల్చినప్పుడు మూతబడిన హబ్బాకడల్‌లోని చారిత్రక రఘునాథ మందిరం 2026 రామనవమి నాడు భక్తుల కోసం తెరుచుకుంది. పూజలు లేని, అర్చనలు లేని ఆ ఆలయం ఇప్పుడు పునరుజ్జీవం పొందింది.

డోగ్రా రాజవంశ వారసత్వం
1857లో నిర్మితమైన ఈ ఆలయం, డోగ్రా రాజవంశానికి చెందిన మహారాజా గులాబ్‌ సింగ్‌ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యవంశీయ క్షత్రియ రాజులు తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడికి అంకితమిచ్చిన ఈ మందిరం, శ్రీనగర్‌లోని హిందువులు ఎక్కువగా నివసించే హబ్బాకడల్‌ ప్రాంతంలో నిర్మించబడింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పూర్‌లో ఉన్న రఘునాథ ఆలయం 1947లో ముస్లిం దాడుల తర్వాత హిందువులు భారత్‌కు వచ్చారు. తర్వాత ఆలయం మూతపడింది. మంగ్లా డ్యాం నిర్మాణంతో మునిగిపోయింది. నీటిమట్టం తగ్గినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. పూజలు జరగడం లేదు. జమ్మూ నగరంలోని రఘునాథ ఆలయం 2002లో ఉగ్రవాద బాంబు దాడులకు గురైంది. అయినా పూజలు కొనసాగుతున్నాయి. కిష్త్‌వార్‌లోని మందిరంలో కూడా నిత్యపూజలు జరుగుతున్నాయి.

Also Read: పైసలు ఇవ్వరు.. ఓటు వేస్తే హల్వా.. అక్కడే తినాలి..

పునరుద్ధరణ ప్రయాణం..
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ–కశ్మీర్‌లో మార్పుల పవనాలు వీచాయి. ప్రభుత్వం ప్రాచీన నిర్మాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చింది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 2020లోనే ఈ ఆలయ పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. జమ్మూ–కశ్మీర్‌ టూరిజం శాఖ, ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫార్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ సంయుక్తంగా ఈ బాధ్యత తీసుకున్నాయి. పలువురి విరాళాలతో ఆలయ నిర్మాణం పూర్తయింది. స్థానిక ముస్లింలు కూడా ఈ ప్రక్రియలో సహకరించారు. 2026 మార్చి 27న, రామనవమి సందర్భంగా, ఆలయం అధికారికంగా తెరుచుకుంది. స్థానిక హిందువులు, ముస్లింలు, దేశవిదేశాల నుంచి వచ్చిన కశ్మీరీ పండిట్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

36 ఏళ్ల మౌనం తర్వాత శ్రీనగర్‌ రఘునాథ మందిరం మళ్లీ భక్తుల కోసం తెరుచుకుంది. ఉగ్రవాదం వల్ల శిథిలమైన ఈ ఆలయం, ఇప్పుడు పునరుజ్జీవం పొంది కశ్మీరీ పండిట్ల తిరిగివచ్చుటకు నాంది పలికింది. స్థానిక ముస్లింల సహకారం, ప్రభుత్వ చొరవ మరియు ప్రజా భాగస్వామ్యంతో సాధ్యమైన ఈ పునరుద్ధరణ, కశ్మీర్‌ లోయలో కొత్త శకానికి నాందిగా నిలిచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular