AP YSRCP Ministers: ఏపీలో బూతుల నేతలు పెరుగుతున్నారు. నిత్యం బూతులు వల్లిస్తూ జుగుప్సాకర రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బూతుల సంస్కృతి పెరుగుతూ వస్తోంది. తమకు ఒక కుటుంబం ఉందని.. అందులో అమ్మ, అక్క, పిల్లలుంటారని గుర్తించుకోకుండా ప్రత్యర్థులపై తిట్ట దండకానికి దిగుతున్నారు. భరించలేని అసభ్య పదజాలాలతో కించపరుస్తున్నారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమను ఎన్నుకున్నది ప్రజని….వారు తమ భాషను అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యానించడం, ప్రవర్తించడం చేస్తారనుకుంటే ప్రజలు కచ్చితంగా గెలిపించే వారు కాదు. ఇప్పుడు కూడా వారు తప్పు అని భావిస్తే మాత్రం బూతుల నేతలకు శంకరగిరి మన్యాలు తప్పవు. ప్రజలకు మాత్రం బుద్ధిమంతులమని చెప్పుకొని ఓట్లు వేయించుకున్న ఇటువంటి వారు ఇప్పుడు తమ బుద్ధి మందమన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు.
నీచంగా కొడాలి నాని వ్యాఖ్యలు..

బూతుల నేతలకు అవార్డులు ఇస్తే మాత్రం ముందుగా కొడాలి నానికే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ ప్రత్యర్థులను వాడరాని భాషలో, సభ్యత, సంస్కారం లేకుండా చీల్చి చెండాడంలో ఈ నేత ముందుంటారు., ముఖ్యంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేస్తూ కొడాలి నాని మాట్లాడే భాష అత్యంత హేయం. నీచాతి నీచం. రాజకీయమన్నాక ప్రత్యర్థులుంటారు. కానీ శత్రువులు కంటే హీనంగా వ్యక్తిగత హననాన్ని పాల్పడడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు, లోకేష్ లను రాజకీయంగా పలుచన చేయడానికి మానసికంగా దెబ్బ కొట్టాలని కొడాలి నాని నిర్ణయించుకున్నారు. లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన మాటలకు చంద్రబాబు కన్నీరు పెట్టకున్నా విడిచిపెట్టడం లేదు. వ్యక్తిగత దాడి తగ్గించడం లేదు. రోజురోజుకీ తన అసభ్య భాష డోసును పెంచుతున్నారు. దారుణమైన భాషతో విమర్శలు గుప్పిస్తున్నారు. అవి సంచలనం సృష్టిస్తున్నాయి.
సర్వత్రా చర్చనీయాంశం..
ఒకటైతే చెప్పగలం. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు డైనమిక్ గా అనిపించాయి. అటు తరువాత భలే తిప్పికొడుతున్నారే అంటూ వైసీపీ శ్రేణులు సంబరపడేవి. అటు తరువాత వ్యక్తిగత కామెంట్ల డోసు పెరగడంతో అయ్యే ఇలా అనేస్తున్నారన్న ప్రశ్న ప్రారంభమైంది. ఎంతరాజకీయ ప్రత్యర్థి అయినా ఇంట్లో ఉన్న ఆడవారిని బయటకు తెస్తారా? అన్న ప్రశ్న మొదలైంది. కొడాలి నాని వాడుతున్న భాషపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇలానే కొనసాగితే మాత్రం తటస్థులు, రాజకీయ ప్రమేయం లేని వారు సైతం రియాక్డు అయ్యే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి,.నారా భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. అటు భర్తతో పాటు రాజకీయ వేదికలు పంచుకున్న సందర్భాలు కూడా అత్యల్పం. పైగా ఎన్టీ రామారావు కుమార్తె. సాధారణ గృహిణిగా ఉన్న ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతుండడం సగటు మనిషి ఖండిస్తున్నాడు. అటు మహిళా లోకంలో కూడా అదే స్థాయిలో రియాక్టు అవుతుంది.
దిగజారుతున్న వైసీపీ నేతల భాష

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో రాజకీయ భాష దిగజారిపోయిందన్న టాక్అయితే నడుస్తోంది. కట్డడి చేయాల్సిన అధిష్టానం ప్రోత్సహిస్తుందన్న ప్రచారం ప్రజల్లో బలంగా వెళుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై ఎంతలా మాట్లాడితే దానినే ప్రమాణికంగా తీసుకొని పదవులు కట్టబెడుతున్నారన్న టాక్ నడుస్తోంది. అలానే పదవులు పొందినట్టు గణాంకాలు కూడా చెబుతున్నాయి. విశేషమేమిటంటే ఏపీలో ప్రభుత్వ వైఫల్యం బయటపడిన ప్రతీసారి ఈ బూతుల నేతలు తమ నోటికి పనిచెబుతారు. ప్రజల మూడ్ ను డైవర్టు చేస్తారు. అయితే ఈ సారి మాత్రం సీఎం జగన్ ఆదేశాలతోనే బూతుల డోసు పెంచారని రాజకీయ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. లిక్కర్ స్కాంలో సీఎం జగన్ భార్య భారతి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో విపక్షాలు ఆరోపణలు చేయడం ప్రారంభించాయి. అయితే దానికి తగ్గట్టు వైసీపీ నుంచి ఎదురుదాడి లేదని.. చాలా మంది మంత్రులపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో నాయకులు, మంత్రులు రెచ్చిపోయి మాట్లాడడంమొదలు పెట్టారు. కొడాలి నాని వంటి వారు శృతిమించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్పగలం. ఈ రోజుల అవమానించబడుతున్న వారు.. రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి. ఎదురుదాడి చేయకపోతే చేతకానివారవుతామని భావించి అదే స్థాయిలో ప్రతిస్పందిస్తారు. అప్పుడు ఈ బూతుల పరంపర కంటిన్యూ అవుతుంతే తప్ప..పుల్ స్టాప్ పడదు.