Raai Laxmi: ఇలాంటి సంస్కృతి మన తెలుగు చిత్ర పరిశ్రమలో కంటే.. బాలీవుడ్లో అధికంగా ఉంటుంది. ఇక సినిమా తారలు మాత్రమే కాదు.. స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా ఇలాంటి అఫైర్స్.. రిలేషన్లతో వార్తల్లోకెక్కిన వారే. గతంలో బాలీవుడ్ తారలు క్రికెటర్లతో సాగించిన ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ కూడా సాగుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో ధోని పేరు వినిపించడం అప్పట్లో సంచలనం. అయితే వాటికి ధోని నో అని కాని ఎస్ అని కాని చెప్పలేదు.. ప్రతి ఒకానొక సందర్భంలో ధోని కూడా అనేకమంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడని పుకార్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ నటి దీపిక తో ధోని డేటింగ్ చేశాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇక లక్ష్మీ రాయ్ అనే నటితో కూడా ధోని రిలేషన్షిప్ కొనసాగించాలని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.. లక్ష్మీ రాయ్ అప్పట్లో ధోని ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరయ్యేది. పార్టీలలో కూడా కనిపించేది. వాస్తవానికి లక్ష్మీరాయ్ చేసింది వేళ్ళ మీద లెక్కబెట్టుకునే సంఖ్యలోనే సినిమాలు అయినప్పటికీ.. ఐటమ్ సాంగ్ లతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ధోనితో తెగ కనిపించేది. ధోని సెంచరీలు చేసినప్పుడు మైదానంలో సందడి చేసేది. అందువల్లే అప్పట్లో ధోని ఆడుతున్న మ్యాచ్లకు లక్ష్మీరాయ్ తెగ హాజరయ్యేది. లక్ష్మీ రాయ్ ని వీడియో గ్రాఫర్లు తెగ చూపించేవారు. అయినప్పటికీ లక్ష్మీరాయ్ ఏమాత్రం భయపడకుండా ధోనికి సపోర్ట్ చేసేది. ఒకానొక సందర్భంలో ధోని లక్ష్మీరాయ్ వివాహం చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగింది.
Also Read: ఐపీఎల్ రీస్టార్ట్.. పీఎస్ఎల్ పరిస్థితి ఏంటంటే?
ధోని వివాహం జరిగిన తర్వాత..
ధోని వివాహం జరిగిన తర్వాత ఒకసారిగా లక్ష్మీరాయ్ సైలెంట్ అయిపోయింది. ఇక అప్పటినుంచి ధోని ఆడుతున్న మ్యాచ్లకు హాజరు కావడం మానేసింది. ధోని పెళ్లి చేసుకోవడంతో లక్ష్మీరాయ్ సింగిల్గానే మిగిలిపోయింది. ఆ తర్వాత సినిమాలలో బిజీ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం గురించి లక్ష్మీ రాయ్ ఎదుట ప్రస్తావిస్తే..” దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది. ఇప్పటికి జనం దానిని గుర్తుకు పెట్టుకున్నారా? నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాస్తవానికి ధోని గురించి నన్ను పదేపదే అడిగేవారు. ఇలాంటి సమాధానం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. ఒకరకంగా నా కెరియర్లో అది మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఇప్పుడైతే ధోని తన కుటుంబంతో ఉన్నాడు. కానీ ఇలాంటి వాటివల్ల సంసార జీవితంలో విభేదాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇబ్బందికర వాతావరణాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది. విమర్శ చేయడం.. పుకార్లు పుట్టించడం క్షణకాలమైన పని. కానీ దానివల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో పడిన వారికి మాత్రమే తెలుస్తుంది. రేపు ఇదే విషయం గురించి నా పిల్లలు నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి.. అందువల్లే ఇలాంటి విషయాలలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని” లక్ష్మీరాయ్ వ్యాఖ్యానించింది. లక్ష్మీ రాయ్ మాటల్లో ధోనితో ఉన్న రిలేషన్ నిజమే అని తెలిసిపోయింది. కాకపోతే అది అప్పట్లోనే కట్ అయిపోయిందని.. ఇప్పుడు ఎవరి బతుకు వారు బతుకుతున్నారని లక్ష్మీ రాయ్ మాటల్లో స్పష్టమైంది.