spot_img
Homeజాతీయ వార్తలుY S Sharmila Hiking: అయ్య‌య్యో.. ష‌ర్మిల పాద‌యాత్ర‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోరే..!

Y S Sharmila Hiking: అయ్య‌య్యో.. ష‌ర్మిల పాద‌యాత్ర‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోరే..!

Y S Sharmila Hiking: తెలంగాణ‌లో ష‌ర్మిల ప‌రిస్థితి చూస్తుంటే మాత్రం దారుణంగా త‌యారైంది. ఆమెను దివంగ‌త మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె, సీఎం జ‌గ‌న్ చెల్లెలు అంటే ఏపీలో ఎంత ప్రాముఖ్య‌త ఉండేదో అంద‌రికీ విదిత‌మే. కానీ తెలంగాణ‌లో మాత్రం ఆమెను ప‌ట్టించుకునే నాథుడే లేడు. ఆమె నిర‌స‌న‌లు చేసిన‌ప్పుడు గానీ, తొలివిడ‌త పాద‌యాత్ర‌లో గానీ ఆమెపై ఎలాంటి ప్ర‌చారాలు లేవు.

Y S Sharmila Hiking
Y S Sharmila

పోనీ ఇప్పుడు మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తోంద‌ని కూడా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ట్లేదు. ఆమె అస‌లు పాద‌యాత్ర చేస్తున్నట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో నామ‌మాత్రంగా అయినా వినిపించ‌ట్లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో ఆమె ఆగిపోయిన చోట నుంచే త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి మండ‌లంలోని కొండ‌పాక ఊర్లో నుంచి పాద‌యాత్ర‌ను స్టార్ట్ చేసింది ష‌ర్మిల‌.

అయితే ఈ పాద‌యాత్ర‌కు ఎలాంటి ప్ర‌చారం ద‌క్క‌ట్లేదు. ప్ర‌జ‌ల్లో క‌నీసం ఆమె గురించి చ‌ర్చ జ‌ర‌గ‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే ఆమె ఏ ఊర్ల మీద నుంచి అయితే పాద‌యాత్ర చేస్తుందో.. ఆ ఊర్ల‌లో కూడా ఎలాంటి రెస్పాన్స్ క‌నిపించ‌ట్లేదు. రాజ‌కీయ పార్టీల‌కు ముఖ్యంగా ప్ర‌చారం క‌ల్పించే మీడియాలో కూడా ఆమె పేరు వినిపించ‌ట్లేదు.

Also Read: Bandi Sanjay Tweet On KCR Health: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

విచిత్రం ఏంటంటే ఆమె అనుకూల మీడియాలో కూడా త‌న పాద‌యాత్ర పెద్ద‌గా ప్రచారానికి నోచుకోవ‌ట్లేదు. ఖ‌ర్చు భారీగానే ఉన్నా.. అటు సోష‌ల్ మీడియాలో కూడా ఏ మాత్రం ప్ర‌భావం క‌నిపించ‌ట్లేదు. గ‌తేడాది అక్టోబ‌ర్ లో చేవెళ్లలో ఆమె పాద‌యాత్ర ప్రారంభించిన‌ప్పుడు కొంత ప్ర‌చారం అయితే క‌నిపించింది.

కానీ మ‌ధ్య‌లో క‌రోనా, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఆంక్ష‌ల వ‌ల్ల ఆమె పాద‌యాత్ర‌ను ఆపేశారు. కానీ ఇప్పుడు రెండోసారి ప్రారంభిస్తే మాత్రం మునుప‌టిలాగే ప్ర‌చారం అయితే క‌నిపించ‌ట్లేదు. పైగా ఆమె ఏపీ రాజ‌కీయాల్లోకి వెళ్తోంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో అంతో ఇంతో ప‌ట్టించుకునే వారు కూడా పూర్తిగా ఆమెను ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ఇలా ష‌ర్మిల పాద‌యాత్ర నామ‌మాత్రం అయిపోయింది.

Also Read: Janasena Party: జనసేనలోకి జన వరద.. ఆవిర్భావ సభ ముందు ఊపు..

Recommended Video:

 

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper