spot_img
Homeజాతీయ వార్తలుModi Shah Masterstroke Mamata Banerjee: SIR..మోడీ షా మమతపై ప్రయోగించిన మాస్టర్ స్ట్రోక్.. ఎంత...

Modi Shah Masterstroke Mamata Banerjee: SIR..మోడీ షా మమతపై ప్రయోగించిన మాస్టర్ స్ట్రోక్.. ఎంత దెబ్బ కొట్టింది అంటే..

Modi Shah Masterstroke Mamata Banerjee: 15 సంవత్సరాలు.. బెంగాల్ రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా మమతాబెనర్జీ పరిపాలిస్తున్నారు. వాస్తవానికి బెంగాల్ రాష్ట్రాన్ని దక్కించుకోవాలని మోడీ షా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 2021 లో బెంగాల్ మీద గెలుస్తారని అందరు అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. దీంతో మమత మరింత శక్తివంతమయ్యారు. ఏకంగా నరేంద్ర మోడీకి సవాల్ విసిరే స్థాయికి ఎదిగిపోయారు. చివరికి తన రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రవేశించడానికి అవకాశం లేదని నిబంధనలు విధించారు. దీంతో మోడీ ఈగో దెబ్బ తిన్నది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.

బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ అనే నిబంధనను తీసుకొచ్చింది. బెంగాల్ రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెట్టింది. దీనిని మమత వ్యతిరేకించింది. ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకు ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ చేసిన ఎన్నికల సంఘం.. ఒకరకంగా మమతకు మద్దతుగా నిలిచిన వారందరినీ దూరం చేసింది. మమత తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి 15 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇష్టానుసారంగా ఓటర్ల నమోదు చేపట్టారు. వారిలో బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందినవారు అధికంగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే కేంద్ర ఎన్నికల సంఘం బెంగాల్ మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ ఎస్ ఐ ఆర్ నిబంధనలను తీసుకొచ్చింది..

ఎస్ ఐ ఆర్ నిబంధనకు ముందు బెంగాల్ రాష్ట్రంలో 7.6 కోట్ల ఓటర్లు ఉండేవారు. ఎస్ ఐ ఆర్ నిబంధన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో 90 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. వీరిలో 34 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 90 లక్షల ఓట్ల తొలగింపులో.. 63 లక్షల మంది మృతులు లేదా ఆచూకీ లేని వారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 27 లక్షల మంది వివరాలు సందేహస్పదంగా ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్ ఐ ఆర్ నిబంధన తీసుకురావడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఓటు హక్కు తొలగించడం లక్ష్యంగా ఎస్ఐఆర్ నిబంధన తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలు పెడితే హోంశాఖ మంత్రి ఆమిత్ షా వరకు పేర్కొన్నారు. దీనిపై మమత ఆరోపణలు చేసినప్పటికీ.. అవి ఆరోపణలుగానే మిగిలిపోయాయి.

2021 లోనే ఈ నిబంధన తీసుకురావాలని మోడీ అనుకున్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత పకడ్బందీ ప్రణాళికతోనే ఈ నిబంధన తీసుకొచ్చారు. చివరికి మమతను అధికారానికి దూరం చేశారు. మమతకు బలం ముస్లిం ఓటర్లు అని గతంలో అనేక సందర్భాల్లో బిజెపి నేతలు చెప్పారు. అయితే సరైన సమయం కోసం ఎదురుచూసిన బీజేపీ నేతలు.. మమత చేసిన తప్పులను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఎస్ఐఆర్ నిబంధనను స్వాగతించారు.. వాస్తవానికి సందేహాస్పద వివరాలు ఉన్నాయని భారీగా ఓటర్లను ఈసీ తొలగించింది. అయితే వారు తమ వివరాలు సమర్పించి.. ఓటు హక్కు తిరిగి సాధించవచ్చు. కానీ బెంగాల్ రాష్ట్రంలో ఆ అవకాశం చాలా మందికి లేకుండా పోయింది. అందువల్లే టీఎంసీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
AP MLC Elections

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...
Roja

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper