Talasani Srinivas Yadav: అధికార పార్టీ అయితే ఒకతీరు ప్రతిపక్ష పార్టీలకైతే మరోతీరా? ప్రజాస్వామ్యంలో ఎందుకింత వివక్ష. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పైగా వారే నీతులు మాట్లాడతారు. నగరంలో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి జెండాలు, కటౌట్లతో నగరాన్ని నింపేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి అధికార పార్టీ నేతలకు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.

అధికార పార్టీ అయితే ఒకలా మరో పార్టీ అయితే మరోలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని గతంలో అధికార పార్టీనే జీవో తీసుకొచ్చి ఇప్పుడు అదే పార్టీ దాన్ని పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనం. అధికారంలో ఉన్నామనే ధీమానా? గర్వమా? ఏంటనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంటుంది. అందుకే అధికార పార్టీ ఆగడాలపై ఇదివరకు కూడా ప్రశ్నించినా అధికారుల్లో ఎందుకంత నిర్లక్ష్యం.
బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తే అప్పుడు తీరిగ్గా అధికార యంత్రాంగం వచ్చి వారికి జరిమానా విధించినా వారిపై చర్యలేవి? ఇప్పుడు జరిమానా కట్టి మళ్లీ భవిష్యత్ లో చేయరని గ్యారంటీ ఏంటి? రాష్ట్రంలో అధికార యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏ మేరకు విధులు నిర్వహిస్తున్నారు. ఏం చూస్తున్నారు. అధికార గర్వంతో అధికార పార్టీ కొనసాగించే చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదు.
గతంలో మంత్రి కేటీఆర్ స్వయంగా ఫ్లెక్సీలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి కంచే చేను మేస్తే ఎలా? వారికి నైతికత ఉందా? ప్రజలపై విశ్వాసం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు,. ఏదో తూతూ మంత్రంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ. 50 వేలు, మరో ముగ్గురికి కూడా నామమాత్రంగా జరిమానాలు విధించి ఎవరిని తప్పుదారి పట్టిస్తారు? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.

దీనిపై సమగ్రంగా చర్చ జరగాలి. మరోసారి నిబంధనలు ఆతిక్రమిస్తే అవసరమైతే జైలుకు పంపేలా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నగరం వారి సొత్తు కాదు. ప్రజల ఆష్తి. దానిపై ప్రజలకే అధికారం ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలకు ఎందుకు పెత్తనం ఉంటుందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
Also Read:Virat Kohli: కోహ్లీ పని అయిపోయిందా? ఇక వైదొలగాల్సిందేనా?
Recommended Videos:
[…] […]
[…] […]
[…] Viral Picture: పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు. తెలివిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటారు. కొందరు పజిల్స్ పరిష్కరించడంలో శ్రద్ధ చూపిస్తుంటారు పజిల్ కనబడితే చాలు దాన్ని సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టరు. దీంతో తమ మెదడుకు మేత దొరికిందని భావిస్తారు. ఇందులో భాగంగా ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. పజిల్స్ పరిష్కారంలో బుర్ర పెట్టి ఆలోచిస్తుంటారు. దీంతో చాలామంది పజిల్స్ పూర్తి చేస్తే చాలని భావిస్తుంటారు. […]
[…] Top Luxury Car Brands In India: ఫ్యామిలీతో కలిసి కాస్త దూరం ప్రయాణించాలంటే బైక్ సరిపోదు. కారు ఉంటే కుటుంబమంతా కలిసి హాయిగా షికారు వెళ్లొచ్చు. ముట్టుకుంటే అంటుకునే కరోనా వైరస్ వచ్చాక జనాల మైండ్ సెట్ మారింది. ప్రజారవాణా కంటే సొంతగా సెకండ్ హ్యాండ్ కారు అయినా ఉంటే పర్లేదు అని కొనేస్తున్నారు. ఇక చిన్న కార్ల ధరలు కూడా తక్కువగా ఉండడంతో వాటిని కొనుగోుల చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో కొన్ని తక్కువ ధర కార్లు ఉన్నాయి. ఇదే సమయంలో లగ్జరీ కార్లు కూడా మార్కెట్లో కొత్త కొత్తగా వస్తున్నాయి. ఆయా కుటుంబాలు, వారి అవసరాలను బట్టి కార్లను కొనుగోలు చేస్తూంటారు. భారతదేశంలో కార్ల వినియోగం బాగా పెరిగింది. ఎక్కువ మంది కుటుంబమంతా కూర్చొని ప్రయాణించే కార్లను ఎంత ధర అయినా పెట్టి కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే లగ్జరీకార్ల అమ్మకాలు కూడా దేశంలో జోరుగా సాగుతున్నాయి. వినియోగదారులకు అనుగుణంగా ఆటో కంపెనీలు సైతం రకరకాల కార్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, ఫవర్ ఫుల్ ఏసీ, వెల్ కూషన్డ్ సీట్లు, మంచి మ్యూజిక్ సిస్టం లాంటి ఫీచర్లు ఉన్న కార్లు వస్తున్నాయి. మనదేశంలో లగ్జరీ కార్ల వినియోగం కూడా బాగా పెరిగింది. మెర్సిడేస్ బెంజ్, బీఎం డబ్లూ, ఆడీ, జాగ్వార్, వోల్వో, కూపర్, పోర్స్చే, లంబోర్ఘిని, ఇంకా చాలా విదేశీ బ్రాండెడ్ కంపెనీల కార్ల ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే భారతీయుల వాడకం తెలిసిన కొన్ని కంపెనీలు తమ బ్రాంచ్ లను ఇండియాలోను ఏర్పాటు చేస్తున్నారు. భారత్ లో లగ్జరీ కార్ల కంపెనీల వివరాలపై ఓ లుక్ వేద్దాం.. […]