Homeజాతీయ వార్తలుIPS Transfers In Telangana: డీజీపీ మారాడు.. మొత్తం పోలీస్‌ వ్యవస్థనే కేసీఆర్‌ మారుస్తున్నాడు.. ఏంటి...

IPS Transfers In Telangana: డీజీపీ మారాడు.. మొత్తం పోలీస్‌ వ్యవస్థనే కేసీఆర్‌ మారుస్తున్నాడు.. ఏంటి సంగతి? 

IPS Transfers In Telangana: తెలంగాణ కొత్త పోలీస్‌ బాస్‌ విధుల్లో చేరిన నాలుగు రోజుల్లోనే తన మార్కు చూపించుకున్నారు. మంగళవారం ఉదయం టీఎస్‌ఎస్పీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాల ఆధారంగా బెటాలియన్లకు ట్రోఫీలు ఇస్తామని ప్రకటించారు. రాత్రి భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈమేరకు అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

IPS Transfers In Telangana
IPS Transfers In Telangana

బదిలీల్లో మార్క్‌ ఎవరిది?
కాగా, పోలీస్‌ బదిలీల్లో ఎవరి మార్క్‌ అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే అంజనీకుమార్‌ తన మార్కు చూపించారా లేక, ఎన్నికల ఏడాది నేపథత్యంలో అప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితాపై అంజనీకుమార్‌ సంతకం చేశారా అన్న చర్చ జరుగుతోంది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ రతన్‌ , పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్‌ శాండిల్య, ఆర్గనైజేషన్, లీగల్‌ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అదనపు డీజీగా శివధర్‌రెడ్డి, పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, హోంగార్డు అదనపు డీజీగా అభిలాష బిస్తుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మహిళా భద్రత, షీటీమ్స్‌ అదనపు డీజీగా షికా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌ ఇచ్చారు.

గులాబీ బాస్‌ జాబితానే..
29 మంది ఐపీఎస్‌ల తాజా బదిలీల్లో డీజీపీ అంజనీకుమర్‌ కంటే.. సీఎం కేసీఆర్‌ మార్కే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం పోలీస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మహేందర్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడే బదిలీల జాబితా రూపొందించినట్లు తెలిసింది. పోతూ పోతూ కేసీఆర్‌కు అనుకూలంగా బదిలీలు చేశారని తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సర్కార్‌కు అనుకూలులకు కీలక పోస్టింగ్‌ ఇచ్చారని సమాచారం. అందులో భాగంగానే వీఆర్‌లో ఉన్నవారికీ పోస్టింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేందర్‌రెడ్డి రూపొందించిన జాబితాపై అంజనీకుమార్‌ సంతకం చేశారన్న చర్చ ఐపీఎస్‌లలో జరుగుతోంది.

IPS Transfers In Telangana
IPS Transfers In Telangana

మొత్తానికి పోలీస్‌ శాఖలో మార్పు yీ జీపీతోనే ఆగిపోలేదు.. కేసీఆర్‌ తనదైన మార్కుతో వ్యవస్థనే మారుస్తున్నారు. మరి ఇది ఎవరికి లాభిస్తుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper