Dhamaka Collections: మాస్ మహారాజ రవితేజ కి ఒక సాలిడ్ హిట్ పడితే ఎలా ఉంటుందో ఉదాహరణగా నిలిచింది లేటెస్ట్ చిత్రం ‘ధమాకా’..ఈ సినిమా కంటెంట్ గొప్పది ఏమి కాదు..చాలా మామూలు కంటెంట్ అనే చెప్పొచ్చు..యావరేజి అయ్యినప్పటికీ కూడా రవితేజ తన మార్క్ కామెడీ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు..వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన రవితేజ కి మరోసారి పూర్వ వైభవం తీసుకొచ్చింది.

క్రాక్ సినిమా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ ని రవితేజ చూడలేదు ఏమో అని అనుకున్నారు..కానీ ధమాకా క్రాక్ కి మించి సూపర్ హిట్ అవ్వడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది..అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 100 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలు పోస్టర్స్ వదిలారు..ఇప్పుడు ఇది ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
డైలీ ట్రాకింగ్ కలెక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమాకి 80 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది..కానీ నిర్మాతలు అన్న తర్వాత ఎక్కువే చూపిస్తారు పబ్లిసిటీ కోసం..అయితే ఈ చిత్రం ఫుల్ రన్ లో మాత్రం నిజంగానే వంద కోట్ల రూపాయిలు గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు..ఎందుకంటే ధమాకా కలెక్షన్స్ ఇప్పటికీ కూడా స్టడీ గానే ఉన్నాయి.

సంక్రాంతి వరకు రన్ కచ్చితంగా ఉంటుంది..కాబట్టి ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయిలు గ్రాస్ మరియు 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఈ సినిమా కచ్చితంగా రాబడుతుందని చెప్తున్నారు..ముఖ్యంగా న్యూ ఇయర్ రోజు అయితే ఈ సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..గత ఏడాది విడుదలైన పుష్ప , అఖండ సినిమాలకు కూడా ఈ రేంజ్ రన్ రాలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.