Homeజాతీయ వార్తలుLic Bima Sakhi Yojana: ప్రతి మహిళకు వర్క్ ఫ్రం హోం గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన...

Lic Bima Sakhi Yojana: ప్రతి మహిళకు వర్క్ ఫ్రం హోం గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం

Lic Bima Sakhi Yojana: కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొన్ని ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఉజ్వల గ్యాస్ సిలిండర్ పేరిట ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ను ఇస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లో మహిళలు ఆర్థికాభివృద్ధి పెంపొందించడానికి ‘బీమా సఖి యోజన’ పేరిట కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలు వర్క్ ఫ్రం హోం చేయొచ్చు. అలాగే ఖాళీ సమయాల్లో కూడా కాస్త రిలేషన్ షిప్ మెయింటేన్ చేసి ఆదాయాన్ని పొందవచ్చు.అయితే అంతకంటే ముందే మహిళలకు బీమా సఖిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ఇలా మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందిన తరువాత కమీషన్ రూపంలో ఆదాయాన్ని పొందవచ్చు. అదెలాగంటే?

పురుషులతో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం మహిళలు పెళ్లయిన తరువాత ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంటి అవసరాలతో పాటు పిల్లల పెంపకంలోనే వీరు బిజీగా ఉంటున్నారు. అయితే ఖాళీ సమయాల్లో ఆదాయాన్ని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘బీమా సఖి యోజన’ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన వారి వరకు మహిళలు ఈ స్కీంలో చేరడానికి అర్హులే. అయితే ఇదివరకు ఎల్ ఐసీ ఏజెంట్లుగా చేసిన వారు… లేదా ఎల్ఐసీతో సంబంధం ఉన్న విధుల్లో పనిచేయకుండా ఉండాలి.

ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ప్రాథమిక వివరాలు అందించి నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ఈ దరఖాస్తును ఎల్ఐసి అధికారులు పరిశీలన చేసిన తరువాత అర్హులో కాదో నిర్ణయిస్తారు. ఒకవేళ అర్హులుగా మారితే వీరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పాస్ అయిన తరువాత మూడు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది. మూడు సంవత్సరాల కాలంలో ప్రతినెల వీరికి నెలకు రూ.7,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఆ తరువాత రెండో సంవత్సరంలో రూ.6,000 అందిస్తారు. మూడో సంవత్సరం రూ.5,000 చొప్పున అందిస్తారు.

అయితే ఈ నగదుతో పాటు ప్రతీ ఏడాది 24 పాలసీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీలు చేయకపోయినా స్టైఫండ్ మొత్తం బ్యాంకులో జమ అవుతుంది. చేస్తే మాత్రం ప్రతీ పాలసీపై అదనంగా కమిషన్ అందిస్తారు. ఒకవేళ ఏడాదిపాటు 24 పాలసీలు చేస్తే.. 48,000 అదనంగా వస్తాయి. అయితే రెండో ఏడాది స్టైఫండ్ పొందాలంటే మాత్రం మొదటి ఏడాది చేసిన పాలసీల్లో 65 శాతం యాక్టివ్ గా ఉండాలి. అయితే బీమా సఖి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమీప ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాలి. లేదా వెబ్ సైట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎల్ఐసి అధికారిక వెబ్ సైట్ https://licindia.in/test2 అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తరువాత పేరు, మొబైల్ నెంబర్ అందించాలి. ఆ తరువాత స్టేట్ తో పాటు జిల్లా పేరు అందించాలి. చివరకగా చిరునామాకు దగ్గర్లోని ఎల్ఐసీ కార్యాలయానికి సంబంధించిన బ్రాంచ్ ను టిక్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ చేయడంతో సంబంధిత అధికారులు పరిశీలన చేస్తారు. ఆ తరువాత ఎంక్వైరీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper