spot_img
Homeజాతీయ వార్తలుపాత ఫార్ములా పైనే కేసీఆర్‌‌ ఫోకస్‌ : ఆ రెండు పార్టీలకు చెక్‌

పాత ఫార్ములా పైనే కేసీఆర్‌‌ ఫోకస్‌ : ఆ రెండు పార్టీలకు చెక్‌

KCR
తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌కు అంత సానుకూల పవనాలు ఏమీ లేవు. రోజురోజుకూ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దెబ్బతింది. దుబ్బాకలో ఓడిపోయిన పార్టీ.. జీహెచ్‌ఎంసీలో చావు తప్పి కన్ను లొట్ట పడ్డంత పని అయింది. దీంతో ఇప్పుడు కేసీఆర్‌‌ తన ఆలోచనలను మార్చుకున్నారట. ఇందుకు నాగార్జన సాగర్‌‌ ఉప ఎన్నికను టార్గెట్‌ చేశారట.

Also Read: ఆ నిర్ణయం జగన్‌కే మంచి చేసిందా..?

ఈ బై పోల్‌లో ఎలాగైనా గెలిచి కాంగ్రెస్‌ను, దూకుడు మీద ఉన్న బీజేపీలకు చెక్ పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా తనను చూసి ఓటెయ్యమని ఆయన అడుగుతుండటాన్ని బట్టి చూస్తే అభ్యర్థిని ఇక్కడ డమ్మీ చేశారు. జానారెడ్డి ఇక్కడ గెలిచినా మరో మూడేళ్లు ఉపయోగం ఉండదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. అంతేకాదు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఓటు వేయవద్దని కూడా ప్రజలకు కేసీఆర్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఉప ఎన్నిక అటు కేసీఆర్‌‌కు, ఇటు టీఆర్‌‌ఎస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం.

తన ఏడేళ్ల పాలనలో ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఉప ఎన్నిక కేసీఆర్‌‌కు సవాల్‌గా మారనుంది. ఇటు విపక్షాలతోపాటు సొంత పార్టీలో తలెగరేస్తున్న నేతల నోళ్లను కూడా మూయించవచ్చు. అందుకే కేసీఆర్ స్వయంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి ముందుగా వచ్చారు. దీంతోపాటు కేసీఆర్ నల్లగొండ జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ప్రతీ గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రతీ మండల కేంద్రానికి 30 లక్షలు ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లాలోని ప్రతీ మున్సిపాలిటీకి కోటి రూపాయలు ఇస్తామని, ప్రత్యేకంగా మిర్యాలగూడ మున్సిపాలిటికీ ఐదు కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నెల్లికల్లు–జింకలపాలెం భూవివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పారు.

Also Read: చైనా సైన్యానికి ధీటుగా బదులిచ్చిన భారత బెబ్బులి ఎవరో తెలుసా?

కానీ.. కేసీఆర్‌‌ హామీలన్నీ కూడా హుజూర్‌‌నగర్‌‌ ఫార్ములా అని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. అక్కడ పర్యటించలేదు. అందుకే అక్కడ ఓడిపోయామని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. హుజూర్‌‌నగర్‌‌లో తన నభ తర్వాత ఓటింగ్ అనుకూలంగా మారిందంటున్నారు. అందుకే.. నాగార్జున సాగర్ విషయంలోనూ హుజూర్‌‌నగర్ ఫార్ములాను అమలు చేయడానికే కేసీఆర్ రెడీ అయ్యారంటున్నారు. మరి కేసీఆర్‌‌ ఎత్తులు ఈ ఉప ఎన్నికలో ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper