Homeజాతీయ వార్తలుKashmiri Pandits: 36 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు చూసి కన్నీళ్లు పెట్టుకున్న కాశ్మీరీ పండిట్లు.....

Kashmiri Pandits: 36 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు చూసి కన్నీళ్లు పెట్టుకున్న కాశ్మీరీ పండిట్లు.. ఇందుకే మోడీ కావాలి

Kashmiri Pandits: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎందుకు ఉండాలి.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగితే దేశానికి ప్రయోజనం ఏంటి.. ఇవే ప్రశ్నలు చాలాకాలంగా వ్యక్తమవుతూనే ఉంది. కొంతమంది ఉదార వాదులు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎందుకు ఉండాలని నిలదీస్తూ ఉంటారు. కానీ, నరేంద్ర మోడీ ఎందుకు ప్రధానమంత్రిగా ఉండాలో.. ఆయన ఉంటే దేశానికి ఏ విధంగా రక్షణ లభిస్తుందో ఓ మహిళ.. ఈ వీడియో ద్వారా చెప్పేసింది.. ఉన్న ఊరును.. కట్టుకున్న […]

Kashmiri Pandits: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎందుకు ఉండాలి.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగితే దేశానికి ప్రయోజనం ఏంటి.. ఇవే ప్రశ్నలు చాలాకాలంగా వ్యక్తమవుతూనే ఉంది. కొంతమంది ఉదార వాదులు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎందుకు ఉండాలని నిలదీస్తూ ఉంటారు. కానీ, నరేంద్ర మోడీ ఎందుకు ప్రధానమంత్రిగా ఉండాలో.. ఆయన ఉంటే దేశానికి ఏ విధంగా రక్షణ లభిస్తుందో ఓ మహిళ.. ఈ వీడియో ద్వారా చెప్పేసింది..

ఉన్న ఊరును.. కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుంది.. అన్ని ఉండి కూడా అనాధ లాగా బతికితే ఆ ఘోరం ఏ స్థాయిలో ఉంటుంది.. పాపం ఈ మహిళ కూడా అలానే ఇబ్బంది పడింది.. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 36సంవత్సరాలుగా ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయిన వాళ్లకు దూరమైంది. కేవలం ఈమె ఒక్కతి మాత్రమే కాదు.. ఎంతోమంది ఇలానే నా అనుకునే పదానికి దూరమయ్యారు. నా వాళ్లకు దూరమయ్యారు. చివరికి ఒంటరిగా జీవితాన్ని కొనసాగించారు.

ఆస్తులను కోల్పోయారు. ఆప్తులను కోల్పోయారు.. ఇన్ని సంవత్సరాలు నిత్యం నరకంలాగా జీవించారు. ప్రతిరోజు గత జ్ఞాపకాలను తలుచుకుంటూ దుఃఖించారు. మొత్తానికి వారి మొర దేవుడు విన్నాడు. వారి బాధను కన్నాడు. నరేంద్ర మోడీ రూపంలో వారి సమస్యను పరిష్కరించాడు. కాశ్మీర్లో పండిట్లు అనాదికాలం నుంచి జీవిస్తూనే ఉన్నారు. ఉగ్రవాదులు పండిట్లను అక్కడినుంచి వెళ్లగొట్టారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. పండిట్లను చంపేశారు. అయితే కొంతమంది బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి బయటపడ్డారు. చివరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భరోసా కల్పించడంతో పండిట్లు సొంత రాష్ట్రానికి రావడం మొదలుపెట్టారు.. సొంత ప్రాంతంలో ఉండడం ప్రారంభించారు. తన ప్రాంతాలను.. తాము నడయాడిన నేలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. చివరికి కన్నీరు పెట్టుకుంటూ.. గత జ్ఞాపకాలను తలచుకుంటూ.. ఏడ్చారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దేశానికి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని.. నరేంద్ర మోడీ ఉంటేనే దేశానికి రక్షణ లభిస్తుందని.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో తమ సొంత నేలకు వచ్చామంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ నే అని పండిట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు లక్షలాది వీక్షణలు సొంతం చేసుకుంది. ఇది పండిట్లు మాత్రమే కాదు.. ఎంతోమంది భారతీయుల భావన అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by మన మోదీ (@manamodi2029)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper