Homeవింతలు-విశేషాలుDrunk Women Fight: పీకల దాకా తాగారు.. నడిరోడ్డు మీదకు వచ్చి రచ్చ రంబోలా..ఈ యువతుల...

Drunk Women Fight: పీకల దాకా తాగారు.. నడిరోడ్డు మీదకు వచ్చి రచ్చ రంబోలా..ఈ యువతుల పోరాటం చూడాల్సిందే..

Drunk Women Fight: అది అత్యంత బిజీగా ఉండే రోడ్డు.. వాహనాల రాకపోకలతో ఆ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంది. ఇద్దరు యువతులు స్కూటీ మీద వచ్చారు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒక యువతి స్కూటీ మీద నుంచి దిగింది. మరో యువతిని నెట్టి వేయడానికి ప్రయత్నించింది. ఇంతలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరిగింది. ఆ తర్వాత రచ్చ రంబోలా మొదలైంది. ఇటీవల కాలంలో యువతులు […]

Drunk Women Fight: అది అత్యంత బిజీగా ఉండే రోడ్డు.. వాహనాల రాకపోకలతో ఆ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంది. ఇద్దరు యువతులు స్కూటీ మీద వచ్చారు. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఒక యువతి స్కూటీ మీద నుంచి దిగింది. మరో యువతిని నెట్టి వేయడానికి ప్రయత్నించింది. ఇంతలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటా మాటా పెరిగింది. ఆ తర్వాత రచ్చ రంబోలా మొదలైంది.

ఇటీవల కాలంలో యువతులు మద్యం తాగి రోడ్లమీదకి వచ్చి హంగామా సృష్టించడం పెరిగిపోయింది. గతంలో అంటే ఈ సంఘటనలు అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. చూసేవాళ్ళకు ఉచితంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన నేటి కాలంలో యువతులు వ్యవహరిస్తున్న తీరుకు ప్రబలమైన నిదర్శనం గా నిలిచింది.

చెన్నైలోని ఓ రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇద్దరు యువకులు పీకల దాకా మద్యం తాగారు. ఆ తర్వాత వారిద్దరు రోడ్డుమీదికి వచ్చారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిద్దరు తిట్టుకున్నారు. కొట్టుకునేంత పని చేశారు. వారిద్దరు వ్యవహరిస్తున్న తీరు చూసి కొంతమంది అక్కడ నిలబడి చూడడం మొదలుపెట్టారు. దీంతో ఆ యువతుల కోసం మరింత పెరిగిపోయింది. ఇంకేముంది చూస్తున్న వాళ్లను తిట్టడం మొదలుపెట్టారు.” ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ నడుస్తోందా.. ఏం చూస్తున్నారు రా.. ఇకనుంచి వెళ్లిపోండి. మేము తిట్టుకుంటాం.. అవసరమైతే కొట్టుకుంటాం.. మీకు ఇక్కడ ఏం పని.. ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు.. మూసుకుని వెళ్లిపోండి.. మీకు తాగే అలవాటు లేదా.. తాగడం ఎక్కువైతే తిట్టుకోరా” అంటూ ఆ యువతులు వ్యాఖ్యానించారు.

నేటి కాలం యువతులు మద్యం తాగుతున్నారు. కాకపోతే ఇలా వీధుల్లోకి వచ్చి గొడవలు చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. పైగా వారు వ్యవహరిస్తున్న తీరు కూడా వింతగా ఉంటుంది. చేతిలో డబ్బులు ఉండడం.. అమ్మ నాన్నలకు దూరంగా ఉండడంతో చాలామంది ఇలా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ మద్యం తాగే అలవాటు ఉన్న యువతులు మానుకోవడం మంచిదని.. మద్యం తాగి ఇలా రోడ్ల మీదకు రావొద్దని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RTV Khammam (@rtv_khammam)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper